Adipurush Teaser: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ టీజర్ పై రోజు రోజుకు పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సిని సెలబ్రిటీలు ఈ టీజర్ పై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు ముఖేష్ కన్నా ఈ టీజర్ పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ నాతో ఏకీభవించకపోవచ్చు కానీ హిందూ దేవుళ్ళు బాడీబిల్డర్లు కాదు. వారి మొహాలు ఎంతో మృదువైన.. చూడటానికి గొప్ప రూపాన్ని కలిగి ఉంటాయి.ఇదివరకు మనం చూసిన రాముడికి గడ్డం మీసాలు లేవని నమ్ముతున్నాను అంటూ ఈయన ఈ టీజర్ పై స్పందించారు.
ఇక హనుమంతుడి ముఖచిత్రం ఎలా ఉంటుందో ఆయన ప్రతిరూపం ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. కానీ మీరు అతని పాత్రను సినిమాలో ఎలా చూపించారు. మీరు ఈ పాత్రల రూపాలను ఏమాత్రం మార్చలేరు. ఇక రావణాసురుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ పాత్ర గురించి కూడా ఈయన మాట్లాడుతూ.. రావణాసురుడి పాత్రకు మొగల్ లుక్ వచ్చిందని తెలియజేశారు.
విఎఫ్ ఎక్స్ తో వేలకోట్ల రూపాయలను ఖర్చు చేసి రామాయణం సినిమాని చేయలేరు. రామాయణం అంటే డబ్బుపై కాకుండా విలువలు, ప్రాధాన్యత, అందులో ఉండే డైలాగులు, లుక్స్ పై ఆధారపడి ఉంటుంది. అయితే మీరు మాత్రం రామాయణం సినిమాని అవతార్ లాగా తీయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు రామాయణం చేస్తున్నామని చెప్పడం మానేయండి, ఆచారాలు ఇతిహాసాలను మార్చడం కోసం డబ్బును వృధా చేయకండి అంటూ ఈ సందర్భంగా ముఖేష్ కన్నా ఆది పురుష్ టీజర్ పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…