Mukesh Khanna : తొంభైలలో వచ్చే శక్తిమాన్ షో తెలియని అప్పటి పిల్లలు ఉండరు. ఇండియన్ సూపర్ హీరో శక్తిమాన్ గా ముకేశ్ ఖన్నా ని ఎవరూ మర్చిపోలేరు అంతలా ప్రభావితం చేసిన నటుడు. శక్తిమాన్ అప్పట్లో పాపులర్ షో, దీంతో శక్తి మాన్ హీరో ముకేశ్ ఖన్నాకు బాలీవుడ్ సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. అడపాదడపా సినిమాల్లో నటించిన ముకేశ్ యాక్టింగ్ స్కూల్ కూడా పెట్టారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ముకేశ్ ఖన్నా మహిళల గురించి వివాదాస్పద వాఖ్యలు చేసారు.

అలాంటి వారు వేశ్యలతో సమానం…
భీష్మ ఇంటర్నేషనల్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు అంశాలపై మాట్లాడుతూ ఉండే ముకేశ్ ఖన్నా తాజాగా అమ్మాయిల గురించి అనుచితంగా మాట్లాడారు. శృంగారం కావాలని అబ్బాయిలను అడిగే అమ్మాయిలు నా దృష్టిలో అమ్మాయిలే కాదు సెక్స్ వర్కర్లే అంటూ ఘాటు కామెంట్స్ చేసాడు. అక్కడితో ఆగకుండా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు డబ్బులకోసం ఇంటర్నెట్ లో తెగ కనిపిస్తూ ఉంటారని ఇలాంటి వారి నుండి యువకులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

ఇక మరికొందరు అమ్మాయిలు డబ్బుల కోసం అబ్బాయిలను టార్గెట్ చేస్తూ బ్లాక్ మైలింగ్ కి పాల్పడుతారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. ఈ వీడియో యూట్యూబ్ లో విడుదలయి బాగా వైరల్ అయింది. మహిళలను కించపరుస్తూ మాట్లాడాడు అంటూ చాలా మంది నెటిజన్స్ మండిపడుతున్నారు.

































