Mukku Avinash : ముక్కు అవినాష్ తల్లికి గుండెపోటు… హాస్పిటల్ లో కంటతడి… వీడియో షేర్ చేసిన అవినాష్…!

0
54

Mukku Avinash : జబర్దస్త్ నుండి బాగా ఫేమస్ అయిన ముక్కు అవినాష్ ఆ తరువాత బిగ్ బాస్ కి వెళ్లి సరికొత్త అవినాష్ గా ప్రొజెక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక పెళ్లి చేసుకున్న అవినాష్ మా టీవీ లోనే పలు షోస్ చేసుకుంటూ మరోవైవు యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. ఇటీవలే తన భార్య గర్భవతి అనే విషయాన్ని కూడా యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేసుకున్న అవినాష్ తాజాగా తన తల్లికి గుండెపోటు రావడంతో వీడియో షేర్ చేసాడు.

అమ్మను అలా చూడలేక పోతున్నా…

అవినాష్ గారి అమ్మకు గుండెపోటు రావడంతో తొలత గ్రామంలోనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ కష్టమని సిటీకి తీసుకెళ్లాలని చెప్పడంతో హైదరాబాద్ లో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు గుండెలో రెండు బ్లాక్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారని, అంజియోగ్రామ్ చేసినట్లు తెలిపారు. ఇక తనకి షుగర్ ఉండటం వల్ల ఇప్పటికే నచ్చిన ఆహారం తినలేక ఇబ్బంది పడుతుంటే మరి ఇలా అమ్మని చూడలేక పోతున్నా అంటూ అవినాష్ వీడియోలో బాధపడ్డారు. తనను ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అవినాష్ తల్లి ప్రస్తుతం బాగానే ఉండగా ఆమె కూడా వీడియోలో మాట్లాడారు.

ఆసుపత్రి బెడ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకులే తనను బతికించారని, ఇప్పుడు వారి వల్లే తాను బతికి ఉన్నానంటూ కంటతడి పెట్టుకున్నారు. మీ దయ వల్ల మంచిగా ఉండి డ్యాన్స్ చేసినా, సంతోషంగా ఉన్నా కానీ నాకు ఇప్పుడు కష్టం వచ్చింది. మీరు లేకుంటే బతకలేను అంటూ కొడుకులను గురించి ఏడ్చారు. నా పెద్ద కొడుకు లేకుంటే ఊరిలోనే ప్రాణం పోయేది. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్లే బతికి ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అవినాష్ తల్లి. ఇప్పుడు అవినాష్ తల్లి డిశార్చ్ అయ్యారని సమాచారం.