Murali Mohan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన మురళి మోహన్ గారు ఆ తారువాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ గా సేవలందించారు. ఇక సినిమా నిర్మాణంలో భాగమై సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమాల్లో అటు రాజకీయాళ్ళనూ క్రియాశీలకంగా లేరు. అయితే చాలా రోజుల తరువాత మళ్ళీ గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు. చిరు నటించిన ఈ సినిమాలో ఆయన ఒక పాత్రలో అలరించారు. ఇక సినిమా మంచి విజయాన్ని నమోదు చేయడంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మాట్లాడిన మురళి మోహన్ గారు చిరంజీవి గారితో అయన అనుబంధం గురించి ‘మన ఉరి పాండవులు’ సినిమా అప్పటి విశేషాలను చెప్పి ఫ్యాన్స్ ను అలరించారు.

విలన్ అవుతాడునుకునే బాక్స్ ఆఫీస్ మొగుడయ్యడు…
మురళి మోహన్ గారు కృష్ణం రాజు గారు చిరంజీవి గారు కలిసి మన ఉరి పాండవులు సినిమాలో నటించారు. ఇక చిరంజీవి గారు అప్పుడు పరిచయం అయ్యారట. ఇక షూటింగ్ అపుడు ఖాళీ సమయం దొరికితే మురళి మోహన్ గారి దగ్గరికి వచ్చి ఏదైనా పాట పెట్టండి భాష ఏదైనా పర్వాలేదు అని చెప్పి అందుకు డాన్స్ చేసేవారట చిరు. ఇక తన కళ్ళు అభినయం చూసి మురళి మోహన్, కృష్ణం రాజు గారు మాట్లాడుకుంటూ రాజు గారు ఇతని కళ్ళు చాలా బాగున్నాయి పెద్ద విలన్ అవుతాడు అని అంటే మురళి మోహన్ గారు లేదండి పెద్ద హీరో అవుతాడు ఇండస్ట్రీకి అమ్మ మొగుడావుతాడు చూడండి అని చెప్పారట.

ఆ సినిమా తరువాత మళ్ళీ మురళి మోహన్ గారు చిరంజీవి గారికి అన్నయ్య గా గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్. అలాగే ఇప్పుడు ఇద్దరూ కలిసి గాడ్ ఫాదర్ లో నటించారు. ఇది కూడా సూపర్ హిట్ అయినందుకు సంతోషంగా ఉంది అంటూ మురళి మోహన్ గారు చెప్పారు. అలాగే ఇండస్ట్రీలో చిరు లాగా డాన్స్ చేసే మరో హీరో లేడంటూ చెప్పారు. ఇక సత్య దేవ్ గురించి మాట్లాడితూ ఈ సినిమాతో తన రేంజ్ మారిపోయిందని కెరీర్ లో ఒక మెట్టు ఎక్కావంటూ ప్రశంసించారు.



































