Murali Mohan : వ్యాపారం నుండి సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన మురళి మోహన్ గారు ఏ ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో నటించారు. ‘జగమే మాయ’ సినిమాతో అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు స్టార్ డమ్ తెచ్చుకున్నారు. మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన అటు సినిమా రంగంలోనే కాకుండా ఇటు పాలిటిక్స్ లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు. ఎంపీ గా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసారు. ఇక మరో వైపు వ్యాపారవేత్తగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఇవన్నీ కాకుండ ఏంతో మంది పేద పిల్లలను చదివిస్తున్నారు మురళీ మోహన్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన జీవిత విశేషాలను తెలిపారు.

మోహన్ బాబు తో గొడవ…
మురళీ మోహన్ గారు మా అధ్యక్షుడి గా ఉన్న సమయంలో సౌత్ ఆర్టిస్తులందరితో క్రికెట్ పోటీలు నిర్వహించాలని అన్ని సినిమా ఇండస్ట్రీలు నిర్ణయించుకోవడంతో తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నాలుగు టీంలుగా క్రికెట్ ఆడి, ఫైనల్స్ రెండు టీంలు ఆడుతాయి అన్నట్లుగా ప్లాన్ చేయగా మోహన్ బాబు గారు వచ్చి నా కొడుకు విష్ణు కూడా ఆడుతాడు అంటూ చెప్పాడు.

అప్పటికి విష్ణు సినిమాల్లో లేడు, సినిమాల్లో నటిస్తున్న వాళ్ళందరూ క్రికెట్ ఆడాలి కానీ సినిమాల్లో లేని వాళ్ళు కాదు అని చెప్తే మోహన్ బాబు నేను అడిగిన కాదంటారా అన్నాడు. ఎవరు అడిగినా రూల్ అదే కదా అని చెబితే మాట మాట పెరిగి ఒకరి కాలర్ ఒకరు పట్టుకున్నాము అంటూ తెలిపారు. ఇక ఆ తరువాత ఒక మూడు రోజులకు మళ్ళీ వచ్చి మోహన్ బాబు నే సారీ చెప్పాడు, ఆ సంగటన తరువాత మళ్ళీ ఎప్పటిలాగే మామూలుగానే ఉన్నాము అంటూ అప్పటి సంఘటన గురించి చెప్పారు.



























