Music Director Keeravani : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. అంతకు ముందు మ్యూజిక్ ప్రపంచంలో గొప్పగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు నాటు నాటు పాటకు రావడం ఆ తరువాత ఆస్కార్ రావడం అన్నీ మన ఇండియాకు గర్వకారణం అని చెప్పాలి. ఇక ఆస్కార్ వేడుకలు ముగిసాయి. ఇక ఆర్ఆర్ఆర్ టీం ఇండియాకు చేరుకుంది.

అస్వస్థతతో హాస్పిటల్ లో కీరవాణి…
అమెరికా నుండి ఆర్ఆర్ఆర్ టీంకు ఇండియాలో ఘన స్వాగతం లభించింది. అయితే అక్కడి నుండి వచ్చిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో చేరారు. బెడ్ మీద ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం ఇంకా మన తెలుగు మీడియాకు చేరిందో లేదో కానీ హిందీ మీడియాతో కీరవాణి అమెరికా నుండి రాగానే మాట్లాడుతున్నపుడు నాకు కోవిడ్ సోకింది వెంటనే హాస్పిటల్ లో చేరతున్నట్లు తెలిపారు.

అమెరికా లో వివిధ ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ ఈవెంట్స్ చేసిన సమయంలోనే కీరవాణికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఇండియా వచ్చిన వెంటనే అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్ చేరి పరీక్షలు నిర్వహంచగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్నారు కీరవాణి.