తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వారికి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా.. క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అంతలా వారికి ఫ్యాన్స్ ఉంటారు. కొన్ని సంవత్సరాల వరకు రాజకీయంలో తన జాతకాన్ని పరీక్షించుకున్న పవర్ స్టార్.. తాజాగ తన రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. తిరిగి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత అతడి సినిమాలో నటించడానికి తీసుకునే రెమ్యూనరేషన్ భారీగా ఉందంటూ సినీ వర్గాల టాక్ .

అయితే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు పవర్ స్టార్ దాదాపు రూ. 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అడిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు తీసిన సినిమాలకు పవర్ స్టార్ రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటించే ఈ సినిమాకు ఎక్కువగా పారితోషికం డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే.. డైరెక్టర్ హరీష్ శంకర్ అతడికి ఎక్కువగా కాల్ షీట్లు ఇచ్చినట్లు సమాచారం.
అంత్యంత సాధ్యమైనంత వరకు సినిమాను తొందరగా ఫినిష్ చేయడానికే ఇలా డైరెక్టర్ కాల్ షీట్లు ఇచ్చారట. అతడి చేతిలో ఇప్పటికే మూడు నుంచి నాలుగు సినిమాల వరకు ఉండటంతో.. తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. వచ్చే జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్రతినిధులు ప్రణాళిక చేసుకున్నారు. అందుకోసమే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ పారితోషికం ఏకంగా 10 కోట్లు పెంచినట్లు తెలుస్తోంది.































