Naga Chaitanya : సమంత, నాగచైతన్య వీళ్లిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పెళ్లి జరిగినపుడు సోషల్ మీడియా మొత్తం వాళ్లే వైరల్ అయ్యారు. ఇక గతేడాది వాళ్లిద్దరూ విడిపోయారు. ఇక విడిపోయాక కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యారు. వీళ్ళు ఎందుకు విడిపోయి విడాకులు తీసుకున్నారో ఎవరికీ కారణాలు చెప్పకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది వాళ్ళు దగ్గరుండి చూసినట్లు కథనాలు అల్లారు. ఇక చైతూ, సామ్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వారి సినిమాలతో బిజీ అయ్యారు.

శోభత ధూళిపాళ్ళ తో డేటింగ్ లో చైతూ…
ఇక ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకొంటూపోతుంటే, మీడియా మాత్రం ఏదో ఒక న్యూస్ వీరి గురించి రాస్తూ ఉంది. అసలే మళ్ళీ బ్యాచిలర్ అయిన నాగచైతన్యకు మొన్నామధ్య తాను నటిస్తున్న వెబ్ సిరీస్ దూత్ లో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ రూమర్స్ వచ్చాయి. ఇక ఓ వైపు నాగార్జున నాగ చైతన్యకు తన అమ్మ పుట్టింటి కి సంబంధించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడంటూ ఒక వార్త వైరల్ అయింది.

ఇక ఇప్పుడు తాజాగా హిందీ మీడియా నాగచైతన్య, గూఢచారి, మేజర్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ కథనాలు రాసింది. తన కొత్త ఇంటికి చైతూ శోభితను ఆహ్వానించి గంటల తరబడి అక్కడే ఉన్నారంటూ రాసింది. అంతేనా మేజర్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శోభిత హోటల్ కు చైతూ చాలా సార్లు వెళ్లాడని ఈ మధ్యనే శోభిత పుట్టినరోజు అత్యంత సన్నిహితుల మధ్య జరిగితే ఆ వేడుకకు చైతూ కూడా వెళ్లాడని రాసారు. మరి నిజమేంటో వాళ్లిద్దరు క్లారిటీ ఇస్తే సరిపోతుంది.






























