Naga Chaithanya : అక్కినేని కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ లో గొప్ప గౌరవం,పేరు ఉన్నాయి. నాగేశ్వరావు గారి లెగసీని అక్కినేని నటవారసుడిగా నాగార్జున నిలబెట్టారు. ఇండస్ట్రీ లో వారసత్వంతో అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ను సృష్టించుకుని అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగారు. అలాంటి నాగార్జున తనయులుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నాగ చైతన్య, అఖిల్ ఇంకా ఇండస్ట్రీ లో నిలదోక్కుకోలేక పోతున్నారు. నాగేశ్వరావు గారి తరువాత నాగార్జున గారు సక్సెస్ అయ్యారు అలా నాగచైతన్య, అఖిల్ సక్సెస్ కాలేక పోతున్నారు. మంచి హిట్లు ఇంతవరకూ వారిద్దరి ఖాతాల్లో లేవు. ఇంకా మార్కెటింగ్ ను పెంచుకోడానికి కస్టపడుతూనే ఉన్నారు.

చైతూ కోసం హీరోయిన్ వేటలో నాగార్జున…
సమంతతో విడాకుల వ్యవహారం తరువాత వచ్చిన ‘బంగార్రాజు’ సినిమా పర్వాలేదానిపించినా నాగార్జున ఉన్నాడు కాబట్టి ఆ క్రెడిట్ చైతూ కి దక్కలేదు. ఇక ఆ తరువాత వచ్చిన ‘థాంక్యూ’ సినిమా డిజాస్టర్ గా మిగిలి నిరాశపరిచింది. సినిమాలో చైతూ నటన అక్కినేని ఫ్యాన్స్ కే నచ్చలేదు. ఇక ఈ సినిమా తరువాత చైతూ పరశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సింది. ఇక ఈ సినిమా పరిస్థితి అటు ఇటు అయితే చైతన్య సినిమా కెరీర్ పోయినట్లే, అందుకే నాగార్జున చైతూ కెరీర్ గాడిన పెట్టేందుకు కస్టపడుతున్నారట.

నెక్స్ట్ సినిమా కోసం హీరోయిన్ వేటలో నాగ్ ఉన్నాడు. ఇక అలనాటి కన్నడ బ్యూటీ మాలశ్రీ కూతురు రాధనా రామ్ ను నాగార్జున సెలెక్ట్ చేశారట ఈ సినిమా కోసం. రాధనా ఆల్రెడీ కన్నడ సూపర్ స్టార్ దర్శన్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు నాగ చైతన్య సరసన పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటించబోతోంది.

































