Nagababu : మెగాబ్రదర్ నాగబాబు సినిమాల్లో పెద్దగా రాణించక పోయినా అన్న తమ్ముడంత అభిమానులు లేకపోయినా జబర్దస్త్ వల్ల బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. ఇక తమ్ముడితో పాటు పొలిటికల్ విషయాల్లో ఉండటం, తమ్ముడి రాజకీయ వ్యవహారాల్లో భాగం అవ్వడం, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం వల్ల అందరికీ సుపరిచితులయ్యారు. ఇక ఆయన కొడుకు వరుణ్ తేజ్ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటుండగా కూతురు నిహారిక తో కలిసి నాగబాబు గారు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తన కూతురుతో చేసే అల్లరిని పంచుకుంటుంటారు.

చేయి కొరికిన నిహారిక… అలా చేయొద్దంటూ అందరికీ విజ్ఞప్తి…
ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో బిజీగా ఉన్న నాగబాబు గారు చేయి కి దెబ్బ తగిలి కట్టుతో సోషల్ మీడియా వీడియోలో కనిపించారు. పక్కన కూతురు నిహారిక కూడా ఉంది. ఇక కూతురితో చాలా నొప్పిగా ఉంది అంటే వెంటనే నిహారిక ఇంకో చేయి ని గట్టిగా కొరికేసింది. దీంతో కెవ్వు మన్న నాగబాబు నొప్పిస్తోంది అంటూ అరిస్తే చూసావా ఆ చేతి నొప్పి పోయింది అంటూ చెప్పడం, ముల్లును ముల్లుతోనే తీయడం అంటే ఇదేనేమో ఇలాంటి వైద్యం నిపుణులైన డాక్టర్ నిహారిక ఆధ్వర్యంలో జరిగింది. ఎవరూ దీన్ని అనుకరించద్దు అంటూ కాప్షన్ ఇచ్చి ఇంస్టాగ్రామ్ లో వీరు వీడియోను పోస్ట్ చేసారు.
ఇక ఈ వీడియోకి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కొంతమంది మెసేజ్ పెడుతుంటే మరికొంతమంది ముల్లును మూళ్ళతో తియ్యడం కాదు చిన్న గీత ముందు పెద్ద గీత గీయడం అంటూ సామెతను సవరించారు. ఇక మా అక్క పెద్ద కోతి అంటూ, ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది అంటూ అభిప్రాయపడుతున్నారు.
































