Nagababu : మెగా బ్రదర్ గా ఇండస్ట్రీ లో పరిచయం అక్కర్లేని పేరు నాగబాబు. అన్న, తమ్ముడు ఇండస్ట్రీ లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నా తాను మాత్రం నిర్మాతగా అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను విలన్ గాను తనని తాను నిరూపించుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నిర్మాతగా ‘ఆరంజ్’ సినిమా వల్ల వచ్చిన నష్టాలతో ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడిన నాగబాబు ఆ తరువాత బుల్లి తెర మీద జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయ్యారు. సినిమాల ద్వారా కొంతవరకే అభిమానులు ఉన్నా జబర్దస్త్ ద్వారా టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

జబర్దస్త్ కి మళ్ళీ వెళ్ళడానికి రెడీ…
ఒకరకంగా నాగబాబు కి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది జబర్దస్త్. జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడమే కాకుండా జడ్జెస్ గా రోజా, నాగబాబు కెరీర్ కి అంతే ఉపయోగపడింది. అయితే చాలా ఏళ్ళు జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న నాగబాబు అందులోనుండి బయటికి వచ్చేసారు. ఇతర ఛానెల్స్ లో జబర్దస్త్ లాంటి కామెడీ షో కి జడ్జి గా వ్యవహరిస్తున్నారు.

ఇక జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన నాగబాబు మళ్ళీ తిరిగి ఆ షో కి వెళ్తారా అనే ప్రశ్న ఎదురైనపుడు జబర్దస్త్ తో నాకు ఎలాంటి గొడవ లేదు, మల్లెమల వాళ్లకు కొంతమంది కమెడియన్స్ కి ఇబ్బందులు వచ్చినపుడు వారి కోసం నేను బయటికి వచ్చేసాను. మళ్ళీ మల్లెమల వాళ్ళు పిలిస్తే వెళ్తాను జబర్దస్త్ జడ్జి గా అంటూ క్లారిటీ ఇచ్చారు.































