Movie News

Nagarjuna – Amala: బాలీవుడ్ తారలతో దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొన్న నాగార్జున దంపతులు.. ఫోటోలు వైరల్!

Nagarjuna – Amala:ఈ ఏడాది దసరా పండుగను సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా దసరా పండుగ సందర్భంగా తెలుగులో కూడా సినిమాలు విడుదలవడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకున్నారు. ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదలయి మంచి హిట్ కావడంతో నాగార్జున కుటుంబ సభ్యులు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దసరా పండుగ సందర్భంగా నాగార్జున దంపతులు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి దసరా వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా నాగార్జున బాలీవుడ్ తారలతో కలిసి దసరా వేడుకలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ కు కేవలం తెలుగులో మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇక ఈ బ్రాండ్ కు వివిధ భాషలలో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నటువంటి సెలెబ్రెటీల అందరిని ఒకే చోట చేర్చి దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

Nagarjuna – Amala: అందరినీ ఒకచోట చేర్చిన కళ్యాణ్ జువెలర్స్..

ఈ క్రమంలోనే నాగార్జున అమలతో పాటు రణబీర్ కపూర్, స్నేహ, కత్రినా కైఫ్,కళ్యాణి ప్రియదర్శన్ వంటి పలువురు సెలబ్రిటీలు ఒకే చోటచేరి దసరా వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అఖిల్ తో కలిసి భారీ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

21 minutes ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

3 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

4 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

4 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

6 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

6 hours ago