Nagarjuna: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారమవుతుంది మరొక రెండు రోజులలో ఈ సీజన్ ముగియనుంది.ఇక గత మూడు సీజన్లో నుంచి ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా నాగార్జున మరికొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.స్క్రిప్ట్ ప్రకారమే నాగార్జున వ్యవహరిస్తారని ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకుని మాట్లాడరంటూ ఈయనపై ఎంతోమంది విమర్శలు కురిపించారు. ఇకపోతే బిగ్ బాస్ నిర్వాహకులపై నాగార్జున కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగర్జున బిగ్ బాస్ నుంచి తప్పుకోబోతున్నారని తెలుస్తోంది.

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ గా రౌడీ హీరో…
బిగ్ బాస్ కార్యక్రమంలో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరుగుతున్నాయని, ముందుగానే విన్నర్ ఎవరో అగ్రిమెంట్ కుదుర్చుకొని కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారంటూ ఈ కార్యక్రమం పై ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి విమర్శలను భరించలేక నాగార్జున ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారని సమాచారం.ఇక నాగార్జున ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగబోతున్నారనే వార్త వైరల్ అయింది. మరి ఇందులో ఎంతవరకు తెలియాల్సి ఉంది.































