టాలీవుడ్ ఇండస్ట్రీలో నవమన్మధుడుగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా చేస్తున్నప్పటికీ వారికి పోటీగా నాగార్జున సినిమాలు చేయటం విశేషం.అయితే ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలు కాస్త వెనుకపడినప్పటికీ, ఆస్తుల విషయంలో, సంపాదనలో మాత్రం నాగార్జున నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారని చెప్పవచ్చు.
ప్రస్తుతం నాగార్జున కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పలు వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడానికి కూడా నాగార్జున సిద్ధమైనట్టు తెలుస్తోంది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం, బిగ్ బాస్ ద్వారా హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునకు స్టార్ మా భారీ మొత్తంలోనే ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా నాగార్జున పెద్ద మొత్తంలో డబ్బును సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.మరోవైపు స్టాక్ మార్కెట్లు, స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా నాగార్జున ఆస్తులు ఉన్నఫలంగా పెరగడంతో నాగార్జున సొంతంగా ఛార్టెట్ ఫ్లైట్ ని కూడా కొన్నట్లు తెలుస్తోంది. తన అవసరాలకు వినియోగించుకుని ఖాళీ సమయంలో ఈ ఫ్లైట్ ను అద్దెకి ఇవ్వనున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఆస్తుల విషయంలో సంపాదనలు నాగార్జున గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.
ఇక సినిమాల విషయానికి వస్తే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి టాక్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సీక్రెట్ ‘రా’ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారు. ఇంకోవైపు ‘బంగార్రాజు’ సినిమాను త్వరలో ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…