Amala: నాగచైతన్య నేను పెంచలేదు..చైతూ అఖిల్ మాదిరి కాదు.. అమల కామెంట్స్ వైరల్!

Amala: అక్కినేని హీరో నాగార్జున భార్యగా సినీ నటిగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనంతరం నాగార్జున పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జునకు అమల రెండో భార్య. ఈయన మొదట దగ్గుబాటి లక్ష్మినీ పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

ఇలా లక్ష్మి విడాకులు ఇచ్చిన అనంతరం నాగార్జున అమలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా అఖిల్ నాగచైతన్య ల గురించి అమల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి నేను నాగచైతన్యను పెంచలేదని నాగచైతన్య తన తల్లి వద్ద పెరిగాడని తెలిపారు.

ఇక టీనేజ్ వచ్చేవరకు నాగచైతన్య తన తల్లి వద్ద ఉన్నారని అనంతరం నాగార్జున వద్దకు రాగా ఆయన హీరోగా తనని ప్రేక్షకులకు పరిచయం చేశారని తెలిపారు. ఇక నాగచైతన్య అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవారని తనతో అఖిల్ చాలా చనువుగా ఉండేవారని తన రాక కోసం అఖిల్ ఎదురు చూస్తూ ఉండేవారని అమల తెలిపారు.

చైతు కోసం ఎదురు చూసేవాడు…

ఇప్పటికి వీరిద్దరి మధ్య అదే అనుబంధం ఉందని అమల తెలిపారు. నాగచైతన్యకు తనకు మధ్య బాండింగ్ లేకపోయినా అఖిల్ తో మాత్రం నాగచైతన్యకు మంచి బాండింగ్ ఉంది అంటూ ఈ సందర్భంగా అమల అఖిల్ నాగచైతన్య గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.