Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు గారి అబ్బాయి గా సినిమాల్లోకి వచ్చి తొంబై దశకంలో టాలీవుడ్ లో ఉన్న నలుగురు అగ్రహీరోల్లో ఒకడిగా వెలిగిన హీరో నాగార్జున. నాగార్జున ఇంజనీరింగ్ అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధిచిన కోర్స్ అమెరికాలో చదువుకున్నారు. నాగేశ్వరావు గారు పెద్ద హీరో అయినా ఎప్పుడు ఆయన పిల్లలు సినిమాల్లో కనిపించలేదు. ఆయన హీరోగా చేస్తున్న రోజుల్లో కూడా పిల్లలను సినిమల్లోకి తీసుకురాలేదు. నాగేశ్వరావు గారు అసలు నాగార్జున ను హీరో ని చేయాలని, సినిమాల్లోకి తీసుకురావాలని అనుకోలేదట.

వ్యాపారం చేయించాలని అనుకున్నా.. సినిమాల్లోకి ఎంట్రీ…
అమెరికాలో ఇంజనీరింగ్ అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రెండు కలిపి ఒకే కోర్స్ గా ఉన్న డిగ్రీ ని ఎంచుకుని అదే చదివించారు నాగేశ్వరావు గారు. అయితే ఇండియా వచ్చాక నాగార్జున గారికి ముందు పెళ్లి చేసి ఏదైనా వ్యాపారం చేయించాలని అనుకున్నారట. ఇదే విషయం నాగార్జున ను అడిగారట. ఏం వ్యాపారం చేయాలని అనుకుంటున్నావో చెబితే ఆ వ్యాపారం లో లైసెన్స్ ఇప్పించడానికి సహాయం చేస్తానని చెప్పారట నాగేశ్వరావు గారు. అయితే నాగార్జున మాత్రం సినిమాల్లో నటిస్తానని చెప్పారట.

నీకు నాటకాల అనుభవం లేదు ఎలా నటిస్తావు అంటూ ఇంకోసారి ఆలోచించుకో అంటే నేను సినిమాల్లో నటిస్తాను అనగానే ఇక ఫైట్లు, యాక్షన్, డాన్స్ లో ముంబై లో ఆరునెలల శిక్షణ ఇప్పించి సినిమాల్లోకి వదిలారట. అయితే మొదట్లో కొంచెం తడబడినా తరువాత మంచి విజయాలను అందుకున్నారు నాగార్జున. అయితే తాను నటించిన అన్నమయ్య సినిమా లో తన నటనకు ఒక తండ్రిగా గర్వంగా అనిపించిందని నాగేశ్వరావు గారు ఒక సందర్బంలో పేర్కొన్నారు. ఇక నాగేశ్వరావు గారు నాగార్జున గారి సినిమాలైనా, మనవళ్ల సినిమాలైనా ఒక విమర్శికుడిగా చూస్తారట.


































