జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య సంచలన కామెంట్స్..!

0
198

నందమూరి బాలకృష్ణ.. తాజగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? అసలు అయన పాలిటిక్స్ లోకి వస్తారా రారా? అనేక ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తేనే తెలుగుదేశం బలపడుతుందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్న నేపధ్యంలో బాలయ్య కామెంట్స్ హీట్ పెంచుతున్నాయి.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటకల్ ఎంట్రీ పై తన పుట్టినరోజు సందర్భంగా ఓ టెలివిజన్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు బాలకృష్ణ. అయితే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తనకు బాధ లేదని అయితే ఒకవేళ అతని రాక వాళ్ళ పార్టీకి నష్టం జరిగితే ఎం చేస్తారు అంటూ ప్రశ్నించారు బాలయ్య. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న నా ఇద్దరు అల్లుళ్లు తెలివైన వాళ్లు.. బాగా చదువుకున్న వాళ్ళు.. అటు లోకేష్ అయినా.. ఇటు శ్రీ భరత్ అయినా.. వాళ్లలో ఒక నాయకుడికి కావాల్సిన మంచి లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు దేనికైనా సమర్ధవంతులైన వారు వాళ్ళిద్దరూ.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి పార్టీ పగ్గాలు చేపట్టాలని చాలామంది భావిస్తున్నారు. అందులో ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆలోచనలు వారివి.. అందరూ వాళ్ళ వాళ్ల ఇష్టాన్ని బట్టే మాట్లాడతారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా? రాడా అన్న విషయంపై నేను బాధపడటం లేదు అని అన్నారు బాలయ్య. ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే అది టీడీపీకి ప్లస్ అవుతుందంటారా? లేదా? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ‘చిన్న నవ్వు నవ్విన బాలయ్య. ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆ తరువాత ‘ఒకే మీరు అన్నట్టే ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చిన ముందు ప్లస్ అయ్యి ఆ తరువాత మైనస్ అయితే’ అంటూ ప్రశ్నించారు బాలయ్య.

అయితే ఆ తరువాత ‘ప్లస్, మైనస్ ఎల్లప్పుడూ బ్యాడ్.. ప్లస్ + ప్లస్, మైనస్ ఈజ్ ప్లస్.. అంటూ బాలయ్య స్టైల్ లో అర్ధమయ్యి కానట్టుగా ఏవో లెక్కలు వేసారు బాలయ్య. ‘ఏదో రామారావుగారు సినిమాలో ఉన్నారు. సీఎం అయ్యారు.. అలానే అని అన్నీ అవ్వాలంటే కావు. టీడీపీ ఒక ఆవేశం నుంచి పుట్టింది. తెలుగు దేశం కార్యకర్తలు చాలా నిబద్ధత కలిగిన వారు. అటువంటి వారికే టీడీపీలో సముచిత స్థానం ఉంటుంది. యువత రాజకీయాల్లోకి రావాలి.. యువతను ప్రోత్సహించాలి అని గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా’.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు బాలయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here