Nandhamuri Balakrishna : నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో 23 రోజులు చికిత్స పొందుతూ చివరికి శివరాత్రి నాడు కన్నుమూశారు. ఇక ఆయన అంత్యక్రియలు తరువాత మూడో రోజున ఆయన పుట్టినరోజు, చిన కర్మ ఒకే రోజు రావడంతో ఒక్కసారిగా తారకరత్న కుటుంబ సభ్యులు, అభిమానులు బాధపడ్డారు. ఇక ఆ కార్యక్రమంలో కూడా అన్నీ తానై నందమూరి బాలకృష్ణ కార్యక్రమంలో మొత్తం చూసుకున్నారు.

పిచ్చోడితో ఒప్పిగ్గా మాట్లాడిన బాలకృష్ణ…
ఇక చిన కర్మ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నందమూరి బాలకృష్ణ అందరినీ పలకరిస్తూ అక్కడ అన్ని పర్యవేక్షిస్తూ ఉండగా హఠాత్తుగా ఒక పిచ్చివాడు అక్కడికి వచ్చి బాలకృష్ణ తో ఏదో మాట్లాడటం జరిగింది. తాను ఏం మాట్లాడాడో ఎవరికీ తెలియకపోయినా అందుకు సంబంధిచిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అసలు ఆ పిచ్చివాడు ఎలా లోపలికి వచ్చాడో తెలియదు. ఇక ఆతను మాట్లాడుతుంటే బాలకృష్ణ చాలా ఓపిగ్గా అతని మాటలను విన్నాడు.

అతను నందమూరి కుటుంబానికి ఏదో శాపం తగిలింది అని చెప్పడానికి దైవం పంపిన ఒక సూచన అంటూ కొంతమంది నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆ పిచ్చివాడు ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు, అదే ప్రాంతంలో ఎపుడు తిరుగుతూ బిచ్చం ఎత్తుకుని పొట్టగడుపుకుంటాడు. అయితే తానెవరో అక్కడికి ఎలా వచ్చాడో మాత్రం ఎవరు అడిగినా చెప్పడట.
































