Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ.. నందమూరి నటవారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. మొదట తాతమ్మ కల, దానవీరశూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాలలో నటించాడు. 1984 లో సాహసమే జీవితం, మంగమ్మ గారి మనువడు సినిమాల ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇటు సినిమాలలోనూ, అటు రాజకీయాలు, బసవతారకం హాస్పిటల్ ఇలా బిజీ గా ఉన్నారు. ఇటీవల అఖండ సినిమాతో విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్నారు.

సినిమా టైటిల్ లో సింహ ఉంటే హిట్టు పడ్డట్టే…
బాలకృష్ణ సినిమాలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో, టైటిల్స్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటాయి అని తెలిసిందే. ఆయన సినిమాలు అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది టైటిల్ లో సింహ అనే పదం. టైటిల్ లో సింహస్ ఉంటే హిట్టు ఖాయం అనే టాక్ కూడా వుంది. అయన టైటిల్స్ కూడా ఎక్కువగా అలానే ఉంటాయి. ఉదాహరణకు సమరసింహారెడ్డి, లక్ష్మీనరసింహ, సింహా, బొబ్బిలి సింహం, సీమ సింహం మొదలైనవి. అంతేకాకుండా సినిమా విడుదలకి ముందు చిత్ర బృందం తో కలసి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుంటారు. అలానే సినిమాకు సంబంధించి ఒక సీన్ అక్కడ జరిగేలా చూసుకుంటారు. లక్ష్మీనరసింహాస్వామి మీద బాలకృష్ణకు నమ్మకం.

అయితే బాలకృష్ణకు ఆ నమ్మకం ఇప్పటిది కాదంటారు అక్కడి అర్చకులు. ఆదిత్య 369 సినిమా అప్పటినుండి మొదలయిందంట. ఆ సినిమా షూటింగ్ సమయంలో సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఓ సంఖ్యాశాస్త్ర నిపుణులు టైటిల్ లో 369 పెట్టుకోమని సూచించారట. అలా చేయగా ఆదిత్య 369 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అది ఆయనకు సెంటిమెంట్ గా మారిపోయింది. అప్పటినుండి వైజాగ్ వెళ్లి అప్పన్న దర్శనం చేసుకోకుండా ఉండరట. అందుకే లక్ష్మీనరసింహస్వామీ పేరు వచ్చేలాగా టైటిల్ లో సింహ పేరు వచ్చేలా చూసుకుంటారట.

































