Nandamuru Balakrishna : సెలబ్రిటీల ఇంటివద్ద ఏం జరిగినా అది ఒక సంచలనంగా మారుతుంది. అలాంటి వారి ఇంటి వద్ద ఏదైనా వాహనం వేగంగా అటువైపు వెళితేనే వింతగా చూస్తారు అలాంటిది ఏకంగా వేగంగా వెళ్తున్న వాహనం దూసుకెళ్లి ఇంటి గేట్ ను ఢీకొంటే ఇంకేమైనా వుందా, తమ అభిమాన నటుడిని ఇంటివద్ద ఎదో జరిగింది అని జనం చేసే హంగామా మాములుగా ఉండదు. ఇలాంటి ఘటన నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద చోటుచేసుకుంది.

బాలకృష్ణ ఇంటి వైపు వేగంగా దూసుకెళ్లిన కారు….

ఈ ఘటన మంగళవారం సాయంత్రం అంటే మే 17న చోటుచేసుకుంది. నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాలకృష్ణ నివాసం వైపునకు కారు వేగంగా దూసుకెళ్లింది. ఈక్రమం లోనే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తర్వాత బాలకృష్ణ ఇంటివైపునకు ఒక్కసారిగా దూసుకెళ్లిన కారు వారి ఇంటిగేట్‌ను ఢీకొట్టి అక్కడ ఆగిపోయింది.

అయితే కారు నడుపుతున్న యువతీ అంబులెన్స్‌కు దారి ఇచ్చే క్రమంలో డివైడర్‌పైకి ఎక్కించింది. దీంతో ఒక్కసారిగా బాలకృష్ణ ఇంటి వైపునకు దూసుకెల్లి కారు గేట్ ను డీ కొట్టింది. నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు రోడ్డు ప్రమాదం కావడంతో జనాలు ఒక్కసారిగా భారీగా వచ్చారు. దీని కారణంగా అక్కడ కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనాలు వెళ్ళడానికి వీలు కల్పించారు.
































