Nandhamuri Harikrishna : నందమూరి కుటుంబం సినిమా ఇండస్ట్రీ లో పెద్దది. సీనియర్ ఎన్టీఆర్ గారి కింద మహా వృక్షంలా ఎదిగిన వీరి కుటుంబం నుండి ఆయన తనయుడు బాలకృష్ణ హీరోగా వచ్చి అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఇక హరికృష్ణ అపుడప్పుడు సినిమాలల్లో నటించారు ఇక హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అయితే తారక్ ,హరికృష్ణ గారి రెండో భార్య కొడుకు అవడం వల్ల తనను ఎవరు పట్టించుకోలేదు అనే వార్తలు ఎపుడు వినిపిస్తుంటాయి. నందమూరి ఇంట బిడ్డ అయిన తన స్వశక్తి తో కష్టపడి పైకి వచ్చాడు ఎన్టీఆర్. ఒక్కో మెట్టు ఎక్కుతూ అపజయలను విజయాలను మోస్తూ నేడు అగ్ర హీరోగా ఎదిగాడు. అయితే ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబ సభ్యులందరు పట్టించుకోలేదు హరికృష్ణ కూడా తనని దగ్గరకు తీసుకోలేదు అన్నది ప్రచారం. అయితే ఇందులో నిజం లేదని నిరూపించే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొడుకుగా పరిచయం చేస్తూ.. ఎమోషనల్ స్పీచ్….
హరికృష్ణ గారు నటించిన సినిమాల్లో సూపర్ హిట్ సినిమా శివ రామ రాజు అందులో జగపతి బాబు హీరో అయిన హరికృష్ణ గారు పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించారు. ఇక ఆ సినిమా ఆడియో ఫంక్షన్స్ లో హరికృష్ణ గారు తన కొడుకు తారక్ గురించి మాట్లాడిన మాటలు ఇన్నిరోజులు జూనియర్ ఎన్టీఆర్ నిరాధరణకు గురయ్యాడనే పుకార్లకు సమాధానంగా ఉన్నాయి. ఆ సినిమా ఆడియో క్యాసెట్ ను హరికృష్ణ గారు ఆవిష్కరించగా ఎన్టీఆర్ తొలి క్యాసెట్ ను కొనుక్కున్నారు. ఇక వేదిక మీద నిర్మాత, దర్శకుడి అనుమతి తో హరికృష్ణ గారు తన కొడుకు గురించి మాట్లాడారు. తారక్ పుట్టినపుడు ‘త’ అక్షరం తో పేరు పెట్టాలని చెప్పినపుడు తన బాబాయ్ త్రివిక్రమరావు గారు తారక రామారావు అని పెట్టమని సూచించగా ఆ పేరు పెట్టానని తన కొడుకును పట్టించుకోలేదని చాలా మంది మాట్లాడుతున్నారు అందులో వాస్తవం లేదు అంటూ తెలిపారు.

నిజానికి మా నాన్న గారు ఎన్టీఆర్ గారు స్వశక్తి తో ఏదిగారు. ఇక తమ్ముడు బాలకృష్ణ విషయంలో కూడా ఏనాడు నాన్నగారు జోక్యం చేసుకోలేదు నా విషయంలోనూ అంతే అలానే నేను నా పిల్లల విషయంలో అలాగే వ్యవహరించాను. తాను మొదటి సినిమా చేస్తానని చెప్పినపుడు ఒకసారి కథ విన్నాను అంతే ఆ తరువాత పట్టించుకోలేదు. ఎందుకంటే తనకు తాను నిర్ణయాలు తీసుకోవడం రావాలని రేపు కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అంతే తనకి తాను ఇక్కడ ఎదగాలి కానీ నా సలహాలతో కాదు అంటూ వివరించారు. ఇండస్ట్రీ లో ఎవరికీ ఎవరు పోటీ కారు తారక్ కంటే ముందు తారక రత్న వచ్చాడు, అలానే రేపు ఇంకా నందమూరి కుటుంబం నుండి ఇంకా వస్తారు ఎవరి సినిమాలు వారివే ఎవరికీ ఎవరు పోటీ కారు. ఎవరు అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారో వారు ఇండస్ట్రీ లో ఉంటారు అంటూ ఆయన ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.































