Nandigama Rani : గుంటూరు జిల్లాలో హర్షిత స్కూల్ ప్రిన్సిపాల్ నందిగామ రాణి మీద రోజు రోజుకు ఆరోపణలు ఎక్కవయ్యాయి. నిజానికి యూట్యూబ్ లో ఒక ఛానెల్ వాళ్ళు ఆమె సక్సెస్ స్టోరీ వేసాక ఆమె మమ్మల్ని మోసం చేసినదంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఆ ఇంటర్వ్యూలో రాణి అనే మహిళ తన స్కూల్ నిలబడాలని ఎంతో మందిని సహాయం అడిగినా చేయలేదని చివరకు ఎన్ఆర్ఐ అయిన కూరపాటి సుధాకర్ అనే వ్యక్తి అన్నగా తనని ఆదుకుని ముప్పైకోట్లు ఇచ్చినట్లు చెప్పారు. కానీ ఈ ఇంటర్వ్యూ తరువాత బయటికి వస్తున్న వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఏలూరు వద్ద ఉన్న హర్షిత స్కూల్ ప్రిన్సిపాల్ రాణి గురించి ఆమె చాలా ఏళ్ళుగా తెలిసిన బ్రహ్మానంద రావు గారు ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆమె చేసిన మోసాల గురించి వివరించారు.

స్కూల్ ఆమెది కాదు… చాలా మోసాలు చేసింది…
గుంటూరు కి చెందిన బ్రహ్మానంద రావు గారికి 1996 నుండి తెలుసంటూ చెప్పారు. గుంటూరులో వాళ్ళ ఇంట్లో అద్దెకు రాణి ఆమె భర్త ధర్మ రాజు సుమారు పదేళ్ళు ఉన్నారంటూ చెప్పారు. ఇక రాణి నా కొడుకు శ్రీనివాస్ కలిసి స్కూల్ పెట్టాలని డిసైడ్ అయి ఇద్దరూ కొంత డబ్బు పెట్టి స్కూల్ మొదలు పెట్టాలని అనుకుంటే డబ్బు సరిపోకపోతే తాను కొంత ఇచ్చినట్లు అలా మొత్తం స్కూల్ రెడీ అయ్యేసరికి తనకు 19 లక్షల మొత్తం ఖర్చయిందని చెప్పారు. స్కూల్ మొదలయిన కొద్ది రోజులకే ఆమె ప్రవర్తన మారిపోయింది.

అహంకారం, డామినేటింగ్ ఉండటం వల్ల నా కొడుకు పడలేక బయటికి వచ్చేసాడు. కానీ నేను డబ్బు అంత పెట్టి వదిలేయకూడదని అక్కడే ఉన్నాను. స్టూడెంట్ ని చెప్పుతో కొట్టి పెద్ధ గొడవ జరిగినపుడు నేనే సర్ది చెప్పాను అంటూ చెప్పారు. ఇక అప్పుడు కూడా నా స్కూల్ అంటూ మాట్లాడితే కోర్టు కి వెళ్లి నా 19 లక్షల అసలు మాత్రం తెచ్చుకోగలిగాను. ఇక తాజాగా రాణి అన్న అంటూ పిలిచే సుధాకర్ అనే వ్యక్తి కి స్కూల్ కి ఎటువంటి సంబంధం లేదు అంటూ చెప్పడంతో ఆమె మోసాలు బయటపడుతున్నాయి. మరికొంతమంది స్కూల్ లో భాగస్వాములు గా ఉండటానికి డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరినీ మోసం చేసిన రాణి మీద హర్షిత స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆరోపణలు చేస్తున్నారు.