నాచురల్ స్టార్ నానిని వెంటాడుతున్న కరోనా వైరస్ భయం… !! పాపం నాని పరిస్థితి…

0
346

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరిని భయపెడుతుంది. అదే కరోనా వైరస్ ఇప్పుడు నాచురల్ స్టార్ నాని కూడా బెంబేలెత్తిస్తోంది. తాజాగా నాని “వి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా ట్రైలర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించింది. ఈ చిత్రంలో నాని నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. కళ్ళతోనే విలనిజం చూపించాడు నాని.

అయితే ఈ సినిమాను ఉగాది కానుకగా ఈనెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా సినిమా థియేటర్స్ ప్రేక్షకులు లేక విలవిలలాడుతున్నాయి. కేరళలో ఏకంగా ఈనెల 31 వరకు సినిమా థియేటర్లు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు నమోదవుతుండటంతో సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. కరోనా భయానికి తమిళనాడులో విజయ్ నటించిన “మాస్టర్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేసుకున్నాడు. మరోవైపు ఏపీలో స్థానిక ఎన్నికల హడావిడి నడుస్తుంది. ప్రజలు కూడా సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. మరోవైపు విధ్యార్థులు పరీక్షల హడావిడిలో మునిగిపోయారు.

ఇలా రకరకాల కారణాలతో “వి” సినిమా వాయిదా వేసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా కరోనా భయం తగ్గిన తరువాత సినిమా విడుదల చేయమని కోరుతున్నారట. దీనితో నిర్మాత దిల్ రాజు ఆలోచనలో పడ్డారని టాలీవుడ్ వర్గాల సమాచారం. మరో రెండు మూడు రోజులో “వి” సినిమాకు సంబంధిచి కొత్త రిలీజ్ డేట్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here