Narayana Swami : మాములుగా రాజకీయనాయకులు ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అయ్యే రోజులివి. అప్పుడెప్పుడో బి కామ్ లో ఫిజిక్స్ నే మనం ఇంకా మర్చిపోలేదు అంతలా వైరల్ చేసారు. ఇక ప్రభుత్వంలో ఉండి అందునా మంత్రి పదవిలో ఉండి సొంత సీఎంను విమర్శిస్తే అది ఇక ప్రతిపక్షానికి పండగే కదా. టంగు స్లిప్ అయి అనేయడం మళ్ళీ నాలుక కరుచుకోవడం మాములే కానీ వారి బాస్ నుండి మాత్రం క్లాస్ తప్పదు కదా. ఇప్పుడు కూడా ఇలానే అధికార పక్షానికి చెందిన నేత టంగు స్లిప్ అయ్యాడు

జగన్ అవినీతి పరుడు, భూ కబ్జాదారుడు…
తిరుపతి లో జరిగిన పార్టీ ప్లినరి సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి నోరు జారాడు. జగన్ అవినీతి పరుడు, భూ కబ్జాదారుడు, జగన్ మాట్లాడేది అన్యాయమని ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలని పిలుపిచ్చారు. ఇక ఇంతలా మాట్లాడితే ప్రతిపక్షం ఊరుకుంటుందా.. ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఈ వీడియోను పోస్ట్ చేసి నిజం నిప్పులాంటిది ఎక్కువ సేపు దాచుకోలేరు అంటూ కాప్షన్ ఇచ్చింది.

జగన్ రెడ్డి భూకబ్జాదారులకు నాయకుడని, జగన్ మాట్లాడేది అన్యాయమని, కాబట్టి ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి మేల్కొనాలని ఏకంగా డిప్యూటీ సిఎం నారాయణస్వామి తిరుపతిలో అన్న మాటలు ఇవి. నిజం నిప్పులాంటిది ఎక్కువ సేపు నోట్లో దాచుకోలేరు మరి#JaganPaniAyipoyindhi pic.twitter.com/zCi0lZWeBn
— Telugu Desam Party (@JaiTDP) June 28, 2022
అంతేనా జగన్ పని అయిపోయిందంటూ హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేస్తోంది. ఇక నారాయణ స్వామి నోరు జారడం పక్కన పెడితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పించారు. ఇక రాజశేఖరరెడ్డి గారి మరణానికి కారణం సోనియా గాంధీ అంటూ హాట్ కామెంట్స్ చేసారు. జగన్ ను అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా సోనియా గాంధీనే పంపారాని మాట్లాడారు.





























