మన దేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో లాక్ డౌన్ 4.0 తప్పకుండా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ముఖ్యమంత్రుల నుంచి ఈ నెల 15వ తేదీలోగా వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుని, లాక్ డౌన్ ముగింసిపోయే మే 17వ తేదీ లోగా నాలుగో విడత లాక్ డౌన్ విధివిధానాలను ప్రకటిస్తామని చెప్పారు..

ఈ నేపథ్యంలో స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా కట్టడికి చేయడానికి ఉన్న ఏకైక మార్గమని ఆయన అన్నారు. ఇది ఖచ్చితంగా గెలిచితీరాల్సిన యుద్ధమని ప్రధాని మోదీ అన్నారు. ఈ జీవన్మరణ యుద్ధంలో భారత ఔషదాలు ఆశాకిరణంగా మారాయని ప్రధాని పేర్కొన్నారు. మన పురోగతే ప్రపంచ పురోగతిగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఈ సంక్షోభం తరువాత మారుతున్న ప్రపంచాన్ని చూస్తున్నామని.. 21వ శతాబ్దం భారత్‌దేనని ఆయన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.


































