Pushpha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు నెల రోజులు దాటిపోయిన ఎక్కడ చూసినా ఈ సినిమాలో పాటలు ఈ సినిమాలో డైలాగులు వినపడుతూనే ఉన్నాయి.

ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో విదేశాలలో సైతం పుష్ప సినిమాకు భారీ ఈ స్థాయిలో ఆదరణ దక్కిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ లు అలాగే చూపే బంగారమాయే శ్రీవల్లి అనే పాటకు ఎంతోమంది అచ్చం అల్లుఅర్జున్ మాదిరిగానే డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఈ పాటకు డాన్స్ వేసి అందరిని నవ్వించారు. ఈ విషయం మర్చిపోకముందే ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం ఈ పాటకు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు.
నిజంగానే నరేంద్రమోడీ కాదండోయ్…
పుష్ప సినిమాలో ఈ పాటకు నిజంగానే నరేంద్రమోడీ డాన్స్ చేశారా అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్లే… క్రియేటివ్ మైండ్స్ లో కార్టూన్ రూపంలో మోడీ స్టెప్పులేసినట్టు క్రియేట్ చేసి శ్రీవల్లి పాటకు స్టెప్పులు వేయించారు. ఈ పాటకు ప్రధానమంత్రి డాన్స్ చేయడమే కాకుండా తగ్గేదె లే అనే మూమెంట్ కూడా ఎంతో అద్భుతంగా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




























