తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటిసులు జారీ చేసింది. ‘దళిత బంధు’ పథకంలో ‘దళిత’ అనే పదానికి బదులుగా ‘అంబేద్కర్’ అనే పదాన్ని ఉపయోగించాలని మాల సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ ఎస్సీ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

‘దళిత’ పదంలో ‘తక్కువవారు’ అనే భావనను కలిగిస్తుందని తన పిటషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్ పరిశీలించిన కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది.































