Natti Kumar : గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా ఉన్న ఇష్యూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని డాక్టర్ వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చాలని జగన్ సర్కారు నిర్ణయించడం వల్ల తెలుగు దేశం పార్టీ తో మొదలు చాలా మంది సామాన్య జనం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక దీని మీద నందమూరి కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని జగన్ సర్కారును కోరుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే ఇది చాలా డిప్లొమాటిక్ గా చెప్పడం. చాలా మంది నందమూరి అభిమానులకు నచ్చలేదు. ఇక ఈ విషయం గురించి నట్టి కుమార్ స్పందించారు.

ఎన్టీఆర్ చాలా బాగా చెప్పాడు… ఎక్కడో మిస్టేక్ జరిగింది…
ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ ఇష్యూ మీద మాట్లాడుతూ ఎన్టీఆర్ చాలా బాగా స్పందించాడు. వివాదాలకు చోటు ఇవ్వకుండా ఎన్టీఆర్ పేరు మార్చినంత మాత్రాన ఆయన కీర్తి, ఖ్యాతి తగ్గదు అంటూ ఆయన చాలా హుందాగా స్పందించారు. ఈ విషయంలో నేనైనా చెప్పేది అదే. ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తికి జరిగే నష్టం ఏం లేదు కానీ వైస్సార్ పేరు ఇంకేదైనా యూనివర్సిటీ కో లేకపోతే ఇంకేదానికైనా పెట్టొచ్చు.

ఎన్టీఆర్ పేరు ఆల్రడీ ఉన్న దాన్ని ఎందుకు మార్చడం, జగన్ ఎప్పుడూ ఎన్టీఆర్ గారిని అవమానించాలని అనుకోలేదు. అలా అయితే కృష్ణ జిల్లాకు ఆయన పేరు ఎందుకు పెడతారు. ఎపుడూ అలాంటి ఉదేశం జగన్ కు లేదు. అయితే ఎక్కడో పొరపాటు జరిగింది అందుకే ఇలా జరిగింది. అందరం చెబుతున్నాం అలా మార్చొద్దు అని ఆయన ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం అంటూ చెప్పారు.
































