Natti Kumar : ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అమిత్ షా ఎన్టీఆర్ మీటింగ్. పైకి ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ బాగా నటించాడని అభినందించడానికే అంటూ చెప్తున్నా ఒక్కో వైపు నుండి ఒక్కో లాగా వార్తలు బయటికి వస్తున్నాయి. ఒక వైపు ఎన్టీఆర్ బీజేపీ లో చేరుతాడని అంటుంటే మరో వైపు పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టడానికి బీజేపీ ఎన్టీఆర్ ను తెరపైకి తెస్తోంది అంటూ ఎవరికి వారు విశ్లేషస్తున్నారు. ఇక సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కూడా ఈ ఇష్యూ మీద విశ్లేషించారు.

ఎన్టీఆర్ కు ఆస్కార్ పక్కా…
అమిత్ షా ఎన్టీఆర్ ను ఆర్ఆర్ఆర్ సినిమా గురించే పీల్చుంటే రాజమౌళి, రామ్ చరణ్ ను కూడా పిలుచుండాలి కదా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఇక వీటన్నింటిపై మాట్లాడుతూ నట్టి కుమార్ దీనికి రాజకీయ కోణం ఏమి లేదు, ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజకీయాల మీద ఆసక్తి లేదు. ఒకవేళ రాజకీయ కోణం ఉండిఉంటే ఎన్టీఆర్ మేనత్త పురందరేశ్వరి బీజేపీ లో ఉన్నారు కదా ఆవిడా వచ్చి ఉండేవారు కదా అంటూ మాట్లాడారు.

ఇక హిందూ మతం గురించి ప్రపంచానికి చాటిచెప్పేలా సినిమా తీయించాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం ఆల్రెడీ రజనీకాంత్ ను కూడా సంప్రదించారు. ఇప్పుడు ఎన్టీఆర్ ను కలిశారు. రజనీకాంత్ ఎన్టీఆర్ తో కలిపి రాజమౌళి ద్వారా సినిమా తీయాలనీ బీజేపీ భావిస్తోంది. విజయెంద్ర ప్రసాద్ గారు కథ సిద్ధం చేయబోతున్నారు. దీనికోసమే ఎన్టీఆర్ తో అమిత్ షా కలిసారు. ఇక ఎన్టీఆర్ ను అమిత్ షా కలిసారు అంటే ఇక ఎన్టీఆర్ కు ఖచ్చితంగా ఆస్కార్ రాబోతుంది. బీజేపీ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది కాబట్టి ఎన్టీఆర్ కి ఆస్కార్ పక్కా అంటూ అభిప్రాయపడ్డారు నట్టి కుమార్. ఇక ఏపీ లో నెక్స్ట్ టైం కూడా సీఎం జగన్ అవుతారు అంటూ అంచనా వేశారు నట్టి. ఒకవేళ ఏపీ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ను బీజేపీ ఆహ్వానిస్తే అయన ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవచ్చు అంటూ విశ్లేషించారు.



























