Natti Kumar : సంక్రాంతి బరిలో వచ్చిన మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ అలానే నటసింహం బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ రెండు సినిమాలు విజయవంతంగా థియేటర్స్ లో నేటికీ ప్రదర్శింపబడుతున్నాయి. అయితే వీటిలో చిరు సినిమా నెంబర్ వన్ అని మెగా అభిమానులు చెబుతుంటే కాదు వీర సింహా రెడ్డి సంక్రాంతి హీరో అంటూ బాలయ్య ఫాన్స్ చెప్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ వార్ నడుమ అసలు ఏ సినిమా కి ఎంత కలెక్షన్స్ ఉంది అనే విషయం క్లారిటీ ఇవ్వడానికి నిర్మాత నట్టి కుమార్ మాట్లాడారు.

ఏ సినిమా టాప్.. ఏ సినిమా ప్లాప్…
సంక్రాంతి పండుగకు వచ్చిన రెండు సినిమాలు బాగా హిట్ అయ్యాయి, తెలుగు సినిమా పండుగ మొనగాడు అంటూ నట్టి కుమార్ తెలిపారు. రెండు సినిమాలు పెద్ద హిట్ అంటూ చెప్పారు. మొదట విడుదల అయిన వీర సింహా రెడ్డి కలెక్షన్స్ బాగా వచ్చాయి. బెనిఫిట్ షోలో బాలయ్య దుమ్ములేపాడు రికార్డు వసూళ్లు వచ్చాయి అంటూ తెలిపారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా బెనిఫిట్ షోకి అంతగా కలెక్షన్ రాకపోయినా స్లోగా సినిమాకు వసూళ్లు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా వసూళ్ల పరంగా మొదటి ప్లేసులో ఉంది అలానే రెండో స్థానంలో వీర సింహా రెడ్డి ఉంది.

అయితే తెలుగుసినిమాలు రెండూ మంచి వసూళ్లతో దుసుకుపోవడం శుభపరిణామం అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. తమిళంలో వారసుడు మంచి విజయం సాధించినా తెలుగులో ఓ మోస్తరుగా రాణించింది అంటూ చెప్పారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి మెగాస్టార్ బ్యాక్ వచ్చారు గ్యాంగ్ లీడర్ లాంటి ఒకప్పటి మెగాస్టార్ ను మరోసారి ప్రేక్షకులకు చూపించారు అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. వాల్తేరు వీరయ్య సినిమాకు చిరంజీవి, రవితేజ, బాబీ ముగ్గురి సమైష్టి కృషి హిట్ కు కారణం అంటూ తెలిపారు.
































