Naveen Chandra : ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయం అయ్యాడు నవీన్ చంద్ర. సహజంగా ఎదో మన పక్కింటి అబ్బాయిలా వుండే నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. హీరోగానే కాదు విలన్ గా కూడా మెప్పించాడు. ఇపుడు తాజాగా ‘పరంపర’ అనే వెబ్ సిరీస్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే సినిమా ఫీల్డ్ అంటే బ్యాక్ గ్రౌండ్ లేకుండా కొత్తగా వచ్చిన వాళ్లకి మొదట్లో ఆర్థిక కష్టాలు ఉండనే ఉంటాయి, అది సహజం. కొంతమంది అక్కడితో ఆగిపోతారు. మరికొంతమంది పట్టుదలతో వారికి ఉన్న టాలెంట్ తో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ఇలాంటి జాబితాలోకే వస్తారు నవీన్ చంద్ర.

నువ్వు నా స్థాయి వాడివి కాదు అంటూ…
కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడిన నవీన్ చంద్ర, ఒక హీరోయిన్ చేతిలో తీవ్రంగా అవమానించబడ్డాడట. మెగా హీరోల సరసన ఎక్కువగా నటించిన ఒక హీరోయిన్ నవీన్ చంద్ర తో కలసి ఒక సినిమాలో చేసిందట. అయితే సినిమా షూటింగులో మాత్రం బాగా సన్నిహితంగా ఉంటే వీరిద్దరి మధ్య ఎదో ఉంది అనేలా మీడియా కంట పడి పబ్లిసిటీ తెచ్చుకుందట. సినిమా అయితే హిట్ కూడా కొట్టేసింది. కట్ చేస్తే నవీన్ చంద్రను మోసం చేసిందట.

బాగా దగ్గర అయినట్లే ఉండి తరువాత అవమానించిందట. నువ్వు నా స్థాయి వాడివి కాదు, ఇండస్ట్రీలో నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకో అని తీవ్రంగా అవమానించిందట. అయితే ఆ మాటలకు కన్నీళ్లు కూడా పెట్టుకున్న నవీన్ ఇప్పటికీ ఆ హీరోయిన్ మొహం కూడా చూడలేదట. అయితే బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో అవకాశాలు దక్కించుకుంటున్నాడు నవీన్ చంద్ర. ప్రస్తుతం నవీన్ కు కోలీవుడ్ ఆఫర్లు కూడా రావడం విశేషం.



























