Naveen Murder Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గిరిజన యువకుడు నవీన్ హత్య కేసులో నిహారిక రెడ్డి ప్రమేయం ఉంది అంటూ నవీన్ కుటుంబం మొదటి నుండి ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా నిహారిక రెడ్డిని ఇటీవలే అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక ఈ కేసులో నిహారిక అలాగే హరిహర కృష్ణ ఇద్దరికీ ఉరి శిక్ష పడాలి అంటూ నవీన్ కుటుంబం కోరుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే హరిహర, నిహారిక, హాసన్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. అయితే తాజాగా కేసులో A3 గా ఉన్న నిహారిక రెడ్డికి బెయిల్ రావడంతో సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. ఇక నవీన్ కుటుంబం ఆమెకు బెయిల్ రావడం పట్ల కోపంగా ఉన్నారు.

నిహారిక తో పాటు ఆమె కుటుంబంపై కేసు నమోదు చేయాలి…
నవీన్ కుటుంబం తాజాగా నిహారికకు బెయిల్ రావడంతో ఎల్బి నగర్ డీసీపీ ని కలిశారు. కేసులో నిహారిక రెడ్డి కుటుంబం ప్రమేయం కూడా ఉందని ఆమె తండ్రి అలాగే మామ పేర్లను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఆమెకు బెయిల్ ఎలా వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నిహారిక మేనమామ నవీన్ ను ఒకసారి బెదిరించాడని మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ నవీన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇక గిరిజన పిల్లలైన వరంగల్ ప్రీతి, ఇంటర్ విద్యార్థి సాత్విక్, లింగాల గిరిజన యువతి ఇలా నెలలోపే ఇంతమంది గిరిజన పిల్లలు వేర్వేరు సంఘటనలలో చంపబడ్డారు. ఇవన్నీ పరువు హత్యలే అంటూ ఆరోపించారు. డీసీపీ స్పందించి లెటర్ రాసిచ్చారని పైస్థాయి అధికారులను కూడా కలిసి మా బాధ చెప్తామంటూ నవీన్ కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. నిహారిక రెడ్డి అలాగే హరిహరకు ఉరి శిక్ష పడాలని అప్పుడే మరెవ్వరూ ఇలాంటి తప్పు సమాజంలో చేయరు అంటూ అభిప్రయపడ్డారు. నిహారికకు ఉరిశిక్ష వేయకుంటే మేమే ఆమెకు శిక్ష వేస్తాం అంటూ హెచ్చరించారు.