Naveen Murder Mistery : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన అత్యంత పాశవిక హత్య వెనుక రోజుకో కొత్త కోణం బయటకు వస్తోంది. నవీన్ అనే బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్బాయిని అతని ఇంటర్ స్నేహితుడు హరిహర కృష్ణ అత్యంత దారుణంగా చంపి తల మొండెం వేరు చేసి, గుండె, మర్మాంగాలను వేరు చేసి వేళ్ళు విరిచేసి అత్యంత క్రూరంగా చంపాడు. ఈనెల 17 న నవీన్ మిస్ అవ్వగా ఇంట్లో వాళ్ళు ఆరా తీసి 21 న పోలీసులను ఆశ్రయించారు. ఇక జరిగినది తెలిసి కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు అసలు హత్యలో హరిహర కృష్ణ మాత్రమే కాదని ఇతరులకు కూడా ప్రమేయం ఉందని, వాళ్ళ పేర్లు బయటికి రావడం లేదని ఆరోపిస్తున్నారు.

ఆ అమ్మాయిని దాస్తున్నారు…
నవీన్ హత్య కేసులో మొదటి నుండి వినిపిస్తున్న పేరు నిహారిక రెడ్డి. హరిహర హత్య తరువాత కూడా ఆ అమ్మాయికి వాట్సాప్ సందేశాలను నవీన్ చేతి వేళ్ళను కట్ చేసి ఫోటో పెట్టడం లాంటివి చేసాడని దానికి ఆమె గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు ఆమెను కేసులో విచారించలేదని నవీన్ బంధువు అభిప్రాయపడ్డారు. నవీన్ నిహారిక రెడ్డి రిలేషన్ లో ఉన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదని చెప్పారు. ఇంటర్ లో కలిసి చదువుకున్న హరిహర కృష్ణ నవీన్ కి టచ్ లో ఉన్నాడని ఇంటర్ స్నేహితులంతా గెట్ టు గెదర్ పార్టీ చేసుకుంటున్నాం అని పిలిస్తే నల్గొండ నుండి నవీన్ హైదరాబాద్ కి వెళ్లాడని, అక్కడ హరిహర కృష్ణ, జీవన్ అనే మరో వ్యక్తి నవీన్ ను తీసుకెళ్లారు అని చెప్పారు.

17వ తేదీ నైట్ తిరిగి హాస్టల్ వస్తాను అని బి టెక్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అన్నం తెచ్చిపెట్టమని చెప్పాడని అయితే 17న వచ్చిన కాల్ తరువాత మళ్ళీ నవీన్ ఫోన్ స్విచ్చాఫ్ అయిందని తెలిపారు. హాస్టల్ నుండి 19వ తేదీ నైట్ నవీన్ ఇంకా రాలేదని ఫోన్ వచ్చింది. ఇక హరిహర కూడా టచ్లోనే ఉన్నాడు. నవీన్ కు నాకు చిన్న గొడవ అయింది కొట్టుకున్నాం కానీ హాస్టల్ వెళ్లిపోవాలని చెబితే డ్రాప్ చేసానని చెప్పాడని, మేము అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లే వరకు హరిహర టచ్ లో ఉన్నాడని తెలిపారు నవీన్ బంధువు. ఇక ఈ కేసులో నిహారిక రెడ్డి అనే అమ్మాయి ని కూడా విచారిస్తే నిజాలు బయటికి వస్తాయని అభిప్రాయ పడ్డారు.































