Naveen murder Mistery : నవీన్ హత్య కేసులో వణుకు పుట్టించే నిజాలు బయటపెట్టిన నిహారిక…!

0
576

Naveen murder Mistery : నవీన్ అనే బిటెక్ విద్యార్థిని అత్యంత దారుణంగా అతని స్నేహితుడు హరిహర కృష్ణ చంపడం, అది కూడా తన ప్రియురాలు నిహారిక కోసం చంపడం, ఏదో క్షణికావేశంలో చేసాడు అనేలా కాకుండా మూడు నెలల ముందు నుండే ప్లాన్ వేసి పక్కాగా చంపాడు హరిహర కృష్ణ. ఈ కేసులో ఇంతవరకు నిహారిక గురించి విషయాలు బయటికి రాలేదు. హరిహర హత్య చేస్తున్నట్లు తనకు తెలియదంటూ చెప్పిన నిహారిక అరెస్టు తరువాత మొదటి సారి పోలీసుల ఎదుట నోరు తెరిచింది. నవీన్ తో పరిచయం దగ్గరి నుండి నవీన్ హత్య తరువాత జరిగిన సంఘటనల వరకు అన్నింటినీ చెప్పింది. ఆర్య 2 సినిమాకు ఏ మాత్రం తీసిపోని క్రైమ్ లవ్ స్టోరీలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

మొదట నవీన్ తరువాత హరి…

ఇంటర్ లో నవీన్ పరిచయం ఆపైన ప్రేమ, నిహారిక ఇంట్లోనే ఇద్దరూ కలుసుకునే వాళ్ళు. ఇక నిహారికకు హరిహర ను పరిచయం చేసాడు నవీన్. ఇక నవీన్ నిహారిక గొడవపడినప్పుడల్లా హరిహర నే మధ్యలో సర్ది చెప్పేవాడు. వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్తలు వచ్చినా నిహారిక హరిహర కు చెప్పుకునేది. ఒకానొక టైములో నవీన్ తో నిహారికకు పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ తరువాత నవీన్ తో మాట్లాడలేదు నిహారిక. అదే సమయంలో హరిహర నిహారికకు లవ్ ప్రపోజ్ చేసాడు. మొదట్లో మౌనంగా ఉన్నా చివరకు ఓకే చెప్పేసింది నిహారిక. అయితే హరిహర తో నిహారిక మాట్లాడుతూందన్న విషయం నవీన్ కు తెలిసినా నవీన్ నిహారికతో మాట్లాడేవాడు. ఇక నవీన్ ఇంకా నిహారికను ప్రేమిస్తుండటం నచ్చని హరిహర ఒకరోజు నిహారికతో నవీన్ ను చంపి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లి పోతా అని చెప్పాడట. సరదాగా చెప్తున్నాడని పట్టించుకోలేదు నిహారిక. ఇక మరోసారి హరిహర తన ఇంటికి నిహారికను తీసుకెళ్లి నవీన్ ను చంపడానికి కొన్న కత్తి గ్లౌస్లు చూపించే సరికి ఇలా హత్య చేస్తే జైలుకి వెళ్తావ్ పిచ్చి పనులు చేయకు అని వారించిదట. చివరకు జనవరి 15న నవీన్ ను చంపాలని హరిహర అనుకున్నా ఆ రోజున నవీన్ హైదరాబాద్ రాలేదు. ఇక ఫిబ్రవరి 17న నవీన్ నిహారికకు హైదరాబాద్ వస్తున్నట్లు మెసేజ్ చేయగా నేను వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని నిహారిక హరి చెప్పమన్నట్లు చెప్పింది. ఇక హరిహర కి కాల్ చేసి నవీన్ వస్తున్నట్లు చెప్పింది నిహారిక. ఇక పై నవీన్ నీతో మాట్లాడడు అని హరిహర చెప్పినట్లు వివరించింది.

ఫిబ్రవరి 18న హరిహర కలవాలని ఫోనే చేస్తే వెళ్లి కలిసినట్లు ఆ సమయంలో మాసిపోయిన బట్టలతో హరిహర ఉండటంతో విషయం అడుగగా నవీన్ హత్య గురించి చెప్పాడని వేంటనే పోలీసులకు లొంగిపోవాలని చెప్పి డబ్బులు లేవంటే 1500 ఇచ్చానని తెలిపింది. ఫిబ్రవరి 20న కాలేజీ నుంచి వస్తుంటే ఎల్బీనగర్ బస్‌స్టాండ్‌లో హరిహర కలిశాడు. నవీన్‌ని చంపిన చోటు తల పడేసిన చోటుని చూపిస్తానని తనతో తీసుకెళ్లాడు. బ్రాహ్మణపల్లి దగ్గర నవీన్ తలని, కత్తిని, సెల్‌ఫోన్ పడేసిన స్థలం ఇదేనని దూరం నుంచి చూపించాడు. అక్కడి నుంచి అబ్దుల్లాపూర్ మెట్ లో అమృత విలాస్ లో ఇద్దరం కలిసి బిర్యానీ తిన్నాం. అక్కడి నుంచి తిరిగి వచ్చే రూట్ లో నవీన్‌ను చంపేసిన స్థలం చూపించాడు. తిరిగి నన్ను మా ఇంటి దగ్గర దింపేసి హరి వెళ్లిపోయాడు, అంటూ నిహారిక తన కన్ఫెషన్ స్టే‌ట్‌మెంట్‌లో పేర్కొంది.