Naveen Murder Mistery : అబ్దుల్లాపూర్ మెట్ లో నవీన్ అనే యువకుడిని అత్యంత దారుణంగా అతని స్నేహితుడైన హరిహర కృష్ణ హత్య చేయడం రెండు రాష్ట్రాలలోనూ కలకలం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు హరిహర తో పాటు మరెవరైనా ఉన్నారా, హత్యకు సహకరించిన వాళ్ళు ఎవరు అనే విషయాలను విచారిస్తున్నారు. గత రెండు రోజేల్లోనే సీన్ రే రీ కన్స్ట్రక్షన్ చేయించిన పోలీసులు హరిహర ప్రవర్తనకు విస్తు పోయారు. అతను చెబుతున్న విషయాలకు షాక్ అవుతున్నారు.

నేను బెయిల్ మీద బయటకు వస్తా…
హరిహర సీన్ రీ కన్స్ట్రక్షన్ లో కూడా ఏ మాత్రం తడబడ కుండా హత్య ఎలా చేసాడో చూపించాడట. ఇక యూట్యూబ్ లో ఎన్నో క్రైమ్ సిరీస్ లు అలాగే పోస్టుమార్టం వీడియోలు చూడటం వల్ల శరీరం నుండి గుండె ఎలా వేరు చేయాలి ఇలాంటివి నేర్చుకున్నానని చెబుతున్నాడట. అంతే కాకుండా టైంకి మూడు పూటలా తింటూ చాలా కూల్ గా ఉన్నాడట హరిహర.

పోలీసులు అడిగిన ప్రతిసారి హత్య నేను మాత్రమే చేసాను ఇంకెవరికీ సంబంధం లేదు, అయినా నేనే లొంగిపోయాను కాబట్టి నాకు జీవిత ఖైదు పడదు. పైగా కొద్ది రోజుల్లోనే బెయిల్ మీద బయటికి వస్తాను, నాకు చట్టం తెలుసు అంటూ పోలీసులకే చెబుతున్నాడట హరిహర. ఈ విషయాలన్నీ వింటూ పోలీసులు షాక్ అవుతున్నారట.



























