Naveen Murder Mistery : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డితో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండెం వేరు చేసి, గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో నవీన్ వేళ్ళను పంపి నిన్ను తాకిన వేళ్ళు ఇవే కదా అంటూ సందేశం పంపాడు. ఇక తరువాత పెదాలను పంపి నిన్ను ముద్దుపెట్టుకున్నది ఈ పెదాలే కదా అంటూ సందేశం పంపగా అందుకు నిహారిక వెరీ గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది. నిహారిక రెడ్డికి అలాగే హరిహర ఇద్దరికీ శిక్ష పడాలి అంటూ నవీన్ సోదరుడు అలాగే నవీన్ కుటుంబం కోరుకుంటోంది.

నవీన్ నిహారిక ఒకప్పుడు ప్రేమించుకున్నారు…
హరిహర నిహారికల మధ్యకు నవీన్ దూరాడని మొదట్లో అందరూ అనుకున్నా నిజానికి ఇంటర్ రెండో సంవత్సరం చదివే సమయంలో నవీన్ హరిహర ఫ్రెండ్స్ గా ఉండగా నిహారిక వాళ్ళ జూనియర్ గా పరిచయం అయింది. నిహారికను తొలుత ప్రేమించిన నవీన్ నిహారిక అగ్ర కులం అమ్మాయి కావడం, తాను గిరిజన కులం అవడంతో సమస్యలు వస్తాయి అందులోనూ మా ఇంట్లో పెద్ద కొడుకుని బాధ్యతలు ఉన్నాయనే ఉద్దేశంతో నిహారికతో చెప్పి విడిపోయాడని నవీన్ తమ్ముడు వివరిస్తున్నాడు.

అయితే నిహారిక రెడ్డి మాత్రం నవీన్ చెప్పినా వినకుండా ఫోన్ చేసి మెసేజెస్ పెట్టి టార్చర్ చేసేదని చెప్తున్నాడు. ఇక తన మాట వినపోకపోతే ఏదైనా చేసుకుంటా అంటూ బెదిరించేదని జనవరి 17న పిలిపించుకోవాలని చూస్తే నవీన్ వెళ్ళలేదని, వెళ్లుంటే అప్పుడే మరణించేవాడని నవీన్ తమ్ముడు చెబుతున్నాడు. ఇక హరిహర కృష్ణకు నవీన్ మీద లేనిపోనివి చెప్పి నిహారికనే హత్య చేయించింది. ఆమెను కూడా పోలీసులు విచారించి శిక్ష వేయాలి. అలా చేయకుంటే నేను పోలీస్ స్టేషన్ ముందే సుసైడ్ చేసుకుంటా అంటూ నవీన్ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.



























