Navya Swamy : సెలబ్రిటీలు ఆడ మగ కాస్త క్లోజ్ గా ఉన్నారంటే వాళ్ళ మధ్య ఏదో ఉందని అనుకునే వాళ్లు ఎంతో మంది. మేము స్నేహితులం మా మధ్య స్నేహం తప్ప ఇంకేం లేదు అని చెప్పినా ఎవరూ వినరు. ఇక సినిమాల్లో కలిసి నటించిన కో స్టార్స్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నవాళ్లు చాలా మందే ఉంటారు. ఒకటో రెండో సినిమాలు తీసే ప్రేమించుకున్నారు అలాంటిది ఇక సీరియల్స్ లో కలిసి నటించిన వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. ఇపుడు వస్తున్న సీరియల్స్ లో చాలా మంది జంటలు నిజ జీవితంలో కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఇక కొంతమంది మంది వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చెప్పకుండా క్లోజ్ గా మూవ్ అవుతూ అందరికీ అనుమానం వచ్చేలా చేస్తుంటారు. అలా బుల్లితెర ప్రేక్షకుల అందరి నోళ్ళల్లో నానుతున్న జంటల్లో చెప్పాల్సిన జంట నవ్య స్వామి, రవికృష్ణ లదే.

కారులో ఆ పని బాగుంటుదంటూ రవి కృష్ణ ను ట్యాగ్ చేసిన నవ్య…
వీళ్ళిద్దరూ ‘ఆమె కథ’ అనే సీరియల్ లో కలిసి పని చేసారు. నవ్యస్వామి ఈటీవీ లో వచ్చే ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో బాగా పాపులర్. ఇక వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేలా వీరి ప్రవర్తన ఉన్నా వీళ్ళు మాత్రం మేము స్నేహితులం అని చెప్పుకుని తిరుగుతున్నారు. చాలా ఈవెంట్లలో వీళ్లిదరూ సందడి చేస్తున్నారు. ఇక కొన్ని ఈవెంట్లను వీరి కోసం డిజైన్ చేస్తున్నారు. అంతలా ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఈ పెయిర్ ప్రస్తుతం ఈటీవీ ఢీ షో లో కూడా ఉన్నారు.

ఇక వీరిద్దరూ క్యాష్ ప్రోగ్రామ్ లో చేసిన రచ్చ అస్సలు ఎవరూ మర్చిపోలేరు. అన్నీ డబల్ మీనింగ్ మాటలతో రెచ్చిపోయారు. ఇక ఇపుడు నవ్యస్వామి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. కారులో బెస్ట్ ఫ్రెండ్ తో వెళ్తూ నచ్చినట్టు పాటలు వింటే బాగుంటుంది, అదొక మరపురాని అనుభూతి అంటూ రవికృష్ణ ను ట్యాగ్ చేసింది. ఇక దీనికి రవి కృష్ణ కూడా స్పందించి అవును అన్నట్లుగా పోస్టు పెట్టడంతో వీళ్ళు ఫ్రెండ్స్ లా ప్రవర్తించడం లేదు లవర్స్ లాగే బిహేవ్ చేస్తున్నారంటూ నెట్టింట్లో కామెంట్స్ వస్తున్నాయి.































