Nayanatara : హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ లు ఏడేళ్లు ప్రేమించుకుని, చివరకు పెళ్లి చేసుకున్నారు. జూన్ 9 న మహాబలిపురంలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న నయన్, విగ్నేష్ శివన్ లకు అభిమానులు, సినిమా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నయన్, విగ్నేష్ శివన్ లు పెళ్లి కాగానే తిరుమల దర్శనానికి వెళ్లిన కొత్తజంట ఇపుడు కొచ్చిన్ పయనం అయ్యారు.

మరోసారి పెళ్లి చేసుకోనున్న నయన్, విగ్నేష్….
ఇక కొచ్చిన్ లో నయనతార తల్లిదండ్రులు ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల వారు పెళ్ళికి హాజరుకాలేదని సమాచారం. అందుకే వారి కోసం మరోసారి వీరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. జూన్ 12న కొచ్చిన్ బయలుదేరిన జంట కొన్నిరోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. వారి విలువైన సమయాన్ని అక్కడే గడపాలని అనుకుంటున్నారట. సినిమాలకు కొంత విరామం ఇచ్చి వీరిద్దరూ వారి సమయాన్ని ఆనందంగా గడపాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇక కొచ్చిన వెళుతూ అభిమానులకు దర్శనమిచ్చి ఆశ్చర్య పరిచారు ఈ జంట. ఇప్పటికే వీరి పెళ్ళికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక వీరి పెళ్లి తంతు హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంతో సొంతం చేసుకుంది. ఇక నయన్ విగ్నేష్ ల పెళ్లి వీడియో ఎపుడు నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుందో తెలియదు.


































