Nayanatara : జూన్ 9 గురువారం మహాబలిపురంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్. మొదట తిరుమలలో చేసుకోవాలని భావించినా కుదరక మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. మహాబలిపురంలోని ఒక హోటల్లో వీరి పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఇక ఈవివాహానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, బోని కపూర్ తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, విజయ్ సేతుపతి, సూర్య, కార్తీ, డైరెక్టర్స్ అట్లీ, మణిరత్నం హాజరై శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ చేతుల మీదుగా పెళ్లిలో అత్యంత ముఖ్యమైన మంగళసూత్రం అందింది.

కానుకలు ఇచ్చి పుచ్చుకున్న దంపతులు….
ఏడేళ్ల తమ ప్రేమకు ఏడడుగుల బంధంతో ఒక్కటైన నయన్, విగ్నేష్ లు తమ జీవిత భాగస్వామి పై ఎంత ప్రేమ ఉందొ కానుకల ద్వారా తెలిపారు. నయన్ చెన్నై లోని ఒక రిచ్ ఏరియాలో తాను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న బంగ్లా ను విగ్నేష్ పేరిట రిజిస్టర్ చేయించిదట నయన్. ఈ ఇంటి విలువ సుమారు 25 కోట్లు ఉండొచ్చని సమాచారం. ఇక తన ఆడపడుచుకి 24 తులాల బంగారం కానుకగా ఇచ్చిందట.

#WikkiNayanWedding Virundhu for 1000 people at Nallagoundampalayam, Coimbatore ????❤️#WikkiNayan #NayantharaVigneshShivan pic.twitter.com/7LIa86mJ1M
— Wikki Nayan Wedding ❤️ (@Rowdy_Pictures) June 10, 2022
ఇక విగ్నేష్ కూడా తన శ్రీమతికి పెళ్లి చీర తో సహా, నగలు కానుకగా ఇచ్చాడట. పెళ్లి రోజున నయన్ వేసుకున్న నగల విలువ సుమారు 3 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఎంగేజ్మెంట్ కోసం నయన్ కి ఇచ్చిన డైమండ్ రింగ్ విలువ సుమారు 5 కోట్లు. ఇక ఈ జంట వారికి ఇచ్చుకున్న కానుకలకంటే గొప్ప విషయం వారి పెళ్ళికి తమిళనాడు వ్యాప్తంగా చాలా చోట్ల వృద్దులకు, పిల్లలకు విందు భోజనం ఏర్పాటు చేసారు. అలా ఈ జంట అందరి ప్రశంసలు పొందారు.































