Nayanatara & Vignesh Shivan : నయనతార పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టి నాలుగు నెలలయింది. తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ఇదేళ్లుగా ప్రేమించిన నయన్ చివరకు పెళ్లి బంధం తో ఒక్కటయ్యారు. వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ పెళ్ళయ్యాక హనీ మూన్ అంటూ విదేశాలలో చక్కర్లు కొట్టారు. ఇక ప్రస్తుతం మళ్ళీ వారి వారి సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లలను కనడమేంటి అనే సంశయం ఒక పక్క అయితే సరోగసి ద్వారా పిల్లల్ని కానాల్సిన పనేంటి నయనతార కు అంటూ వాదనలు బయలుదేరాయి. ఇక ఇదే విషయంలో గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు కూడా ఆయన అభిప్రాయాలను తెలిపారు.

నయనతార చేసింది తప్పు…
ఇక ఇమంది గారు మాట్లాడుతూ ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార, విగ్నేష్ శివన్ పిల్లలను కనడానికి ఎందుకు ఆలోచించారు. నయనతార తన అందం పోతుందని అలోచించి ఉండొచ్చు. ఇక ప్రెగ్నెన్సీ వల్ల తన షూటింగ్స్ కి వెళ్లలేక పోవడం వంటివి జరుగుతాయి, కనీసం కొన్ని నెలలపాటు బ్రేక్ తీసుకోవాల్సి వస్తుందని అలోచించి సరోగసీని ఆశ్రయించి ఉండవచ్చు. కానీ తల్లి నవమాసాలు మోసి కంటే బిడ్డ తో మమకారం ఉంటుంది కేవలం అనిపించుకుంటే కాదు, అనుభూతి చెందితే తల్లి అవుతుంది అంటూ చెప్పారు.

ఇలానే ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి కూడా అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కన్నారు. ఈ పోకడ ఇలా సెలబ్రిటీలు ఆశ్రయించడం వల్ల ఎక్కువ అవుతోంది అంటూ అభిప్రాయపడ్డారు. ఇక నయన తార విగ్నేష్ శివన్ లు సరోగసీ ద్వారా పిల్లలని కన్న విషయం బయటకు రాగానే తమిళ నాడు ప్రభుత్వం వారినుండి వివరణ తీసుకుంటామంటూ చెప్పడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.

































