Nayanatara : లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార పెళ్లి తరువాత మరింత జోరు పెంచి సినిమాలు చేస్తోంది. గత నెల డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న నయన తార హనీ మూన్ ముగించుకుని సినిమాల మీద దృష్టి పెట్టింది. నయనతార షారుఖ్ ఖాన్ కి జోడిగా తొలిసారి హిందీ లో నటించబోతోంది, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతోంది. మొదట సమంత చేతికి ఈ ప్రాజెక్ట్ వచ్చినా సామ్ పెళ్లయ్యాక వేరే కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వదులుకుందని వార్తలు కూడా వచ్చాయి. ఏదేమైనా నయన తార బాలీవుడ్ లోకి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సినిమా తో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా పేరును జవాన్ గా ఖరారు చేసారు. పెళ్లి తరువాత తనకు ఇష్టమున్నంత వరకు నటించడానికి విగ్నేష్ కూడా అంగీకరించడంతో అమ్మడు జోరు పెంచేసింది, అలాగే రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది.

10 కోట్ల పారితోషకం తో షాక్ ఇస్తున్న నయన్…
ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా నయన్ తెలుగులో మెగాస్టార్ చిరు సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది. ఇవి కాక కొత్తగా తమిళ హీరో జయం రవి సినిమాలో నటించబోతోంది. ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ అక్షరాలా 10 కోట్లు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ లో ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరూ ఇంత పారితోషకం తీసుకోవడం లేదు. సమంత, పూజ హెగ్డే, రష్మిక వంటివారు మూడు నుండి ఐదు కోట్ల వరకు తీసుకుంటున్నారు.

అంతకంటే ఎక్కువ ఎవరూ డిమాండ్ చేయడం లేదు. కానీ లేడీ సూపర్ స్టార్ మాత్రం ఏకంగా పది కోట్లు డిమాండ్ చేసింది. పైగా ఆ దర్శక నిర్మాతలు కూడా ఒప్పుకుని సగం డబ్బులు ఆల్రెడీ ఇచ్చేశారనే వార్త బయటికి వస్తోంది. మొత్తానికి కొత్త పెళ్లికూతురి డిమాండ్లు మాములుగా లేవుగా.






























