Neha Chowdary : తెలుగులో యాంకర్ గా మా మ్యూజిక్ లో పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహా చౌదరి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. యాంకర్ గా ఎంత ఫేమస్ అయిందో స్పోర్ట్స్ ఛానెల్ లో రిపోర్టర్ గా అంతకంటే మంచి పేరు తెచ్చుకుంది నేహా. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వచ్చి తన గేమ్ స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది నేహా.

వాళ్ళు నన్ను బాగా వేధించేవారు…
నేహా చౌదరి ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ లో ఫేమస్ రిపోర్టర్ అయితే తాను పుట్టింది తిరుపతిలో, మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నేహా చిన్నతనం నుండే జిమ్నాస్టిక్స్ లో ట్రైనింగ్ తీసుకుంది. ఆ సమయంలో నేహా తన బాల్యం లో ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పింది. జిమ్నాస్టిక్స్ చాలా త్వరగా నేర్చుకోవడం వల్ల సీనియర్ బ్యాచ్ లో ఉండేదాన్ని అని చెప్తూ అయితే దానివల్ల సీనియర్స్ నుండి వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది. సీనియర్స్ తో కలిసి నేను నేర్చుకోవడం వాళ్లకు నచ్చలేదని, నేను పడుకున్నపుడు వచ్చి గట్టిగా గిల్లి పోయేవారు లేచి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు పక్కన దాచిపెట్టుకుని నవ్వేవాళ్ళు.

ఇక వారితో ట్రైన్ లో ప్రయాణించినపుడు చాలా ఇబ్బంది పడ్డానని పైన బెర్త్ లో పడుకుని ఉంటే కిందనుండి పిన్నీసులు, గుండు పిన్నులతో పొడిచేవారు, బలుపా నీకు అంటూ తిట్టేవారు ఇవన్నీ భరించలేక ట్రైన్ లోనుండి దూకి చనిపోవాలని అనిపించింది. కానీ ఈ విషయాలేవీ అమ్మ నాన్నలతో చెప్పలేదని, ర్యాగింగ్ కి మించి వేధించారని కానీ వాటిని భరింఛానంటూ ఎమోషనల్ అయింది నేహా చౌదరి.
































