వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు షాక్.. ఉద్యోగం ఉండాలంటే ఆ పనికి ఒప్పుకోవాలి..

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి. కొందరికి ఇది బాగానే ఉన్నా.. మరికొందరికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. దీనిలో భాగంగానే ఓ కంపెనీ తమ ఉద్యోగుకలు షాక్ ఇచ్చింది. తమ ఉద్యోగుల ఇళ్ళల్లో కెమెరాలు ఇన్‌స్టాల్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఒక వేళ కెమెరాలు పెట్టేందుకు అంగీకరించకుంటే ఉద్యోగం నుంచి కూడా తీసేయడానికి వెనకాడటం లేదు. దీంతో ఈ కంపెనీ తీరు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. టెలీ పర్ఫార్మెన్స్ అనే ఓ ప్రముఖ కాల్ సెంటర్ కంపెనీ ఉద్యోగుల ఇళ్లలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి, రికార్డ్ చేయడానికి ఏఐ-ఆధారిత కెమెరాలను ఇన్‌ స్టాల్ చేస్తామని ప్రకటించింది.

కొలంబియాలో వర్క్ చేస్తున్న ఉద్యోగులపై కెమెరాల ఏర్పాటుపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబసభ్యుల సమ్మతికి సంబంధించి సంతకం కూడా తీసుకుంటారట. 3.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్న ఈ బీపీఓ కంపెనీ.. భారత్ లో 70 వేల మంది ఉన్నారు. కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో వారంతో ఆందోళన చెందుతున్నారు. తాము బెడ్ రూంలో పని చేస్తాం.. అయితే బెడ్ రూంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారా.. అంటూ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగి తమ కంపెనీ సిస్టంలో లాగిన్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి.. భద్రతా కారణాల వల్లనే తాము ఈ పని చేస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత ప్రైవసీకి తమ సంస్థ కట్టుబడి ఉందని.. ఇతర సమాచారం సేకరించాల్సిన అవసరం తమకు లేదని ఈ సంస్థ వెల్లడించింది.