ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు నిన్న రాత్రి అనుమాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే… అయితే మారుతీరావు మూడురోజుల క్రితమే తన ఆత్మ హత్యకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా మారుతీరావు అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మారుతీరావు గత మూడురోజుల క్రితమే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం అయన స్నేహితుడికి సంబంధించిన ఫర్టిలైజర్ షాపు నుంచి పురుగుల మందును మారుతీరావు కొనుగోలు చేసినట్టు సమాచారం. మరో పక్క కూతురు అమృత విషయంలో గత మూడు నెలల నుంచి లాయర్లతో బిజీ బిజీగా మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. కాంప్రమైజ్ అవ్వాలని అమృతకు రాయబారం పంపారట. అమృతను కలవడం కోసం మిర్యాలగూడాకు చెందిన వారితో రాయబారం పంపినట్టు సమాచారం. కానీ అమృత తన మాట వినకపోవడంతో అయన డిప్రషన్లోకి వెళ్లినట్టు సమాచారం.

మరొక పక్క ప్రణయ్ హత్యానంతరం కుటుంబం పరువు పోయిందని మారుతిరావుతో అయన కుటుంబ సభ్యులు తరచూ గొడవలు పడుతున్నారట. ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని అయన సోదరులు గొడవలు పడినట్టు సమాచారం. ఈ విషయంలో అయన తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం.

ప్రణయ్ కేసు ఫైల్స్ తీసుకుని తరచూ హైదరాబాద్ వస్తున్నారు. అదే విధంగా శనివారం అయన ప్రముఖ న్యాయవాదిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. శనివారం సాయంత్రం మినప గారెలు తెప్పించుకుని మరి తిన్నారట. రాత్రి 12 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.




























