ప్రస్తుతం కరోనా వైరస్ వివిధ వేరియంట్లలో ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో కొత్తగా మరికొన్ని రకాల వైరస్లు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇదివరకే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వంటి వ్యాధులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. ఇలాంటి సమయంలోనే బ్రిటన్ లో కొత్తగా నోరో వైరస్ బయట పడింది. ఈ వైరస్ కూడా కరోనా వైరస్ లాగే ఒకరి నుంచి మరొకరికి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది.

ప్రస్తుతం బ్రిటన్లో ఈ నోరో వైరస్ ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. ఈ వైరస్ అన్ని రకాల వయసుల వారికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఈ వైరస్ ఎక్కువగా చిన్న పిల్లలకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. వ్యాధి సోకిన వారు తాకిన వస్తువులను,వారి ఉపయోగించిన వస్తువులను ఇతరులు ఉపయోగించడం ద్వారా తొందరగా వ్యాధి వ్యాప్తి జరుగుతుంది. ఈ క్రమంలోనే చాలామంది ఈ వైరస్ బారిన పడుతున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు వారికి శుభ్రత తెలియకపోవడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందిన వారి వస్తువులను తాకి అలాగే నోట్లో చేతులు పెట్టుకోవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసమే చిన్న పిల్లల విషయంలో ఎంతో పరిశుభ్రతను పాటించాలి. ఈ వ్యాధి సోకకుండా పరిశుభ్రమైన ఆహారం, నీటిని తీసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా వాంతులు, విరోచనాలు, కడుపులో మంట, తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి బారిన పడిన రెండు నుంచి మూడు రోజులలో ఈ లక్షణాలు బయటపడతాయి. ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి కేవలం పరిశుభ్రత ఒకటే మార్గం.ఈ వ్యాధి కరోనా వైరస్ అంత ప్రమాదకారి కాకపోయినప్పటికీ తీవ్రమైన బాధను నొప్పిని కలిగి ఉంటుంది కనుక ఈ వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.