Niharika konidela : మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా వచ్చిన మెగా డాటర్ నిహారిక కొన్ని సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుని తిరిగి మళ్ళీ యూట్యూబ్ వెబ్ సిరీస్ ల వైపు వెళ్ళింది. ఇక పెద్దలు కుదుర్చుకున్న వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే పెళ్లి తరువాత సినిమాల్లో నటించడం పక్కన పెట్టి వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారింది. తన భర్త చైతన్యతో కలిసి ప్రొడ్యూసర్ గా మారింది నిహారిక. అయితే ఈ మధ్యకాలంలో నిహారిక తన జీవితంలోని కొన్ని సంఘటనల వల్ల బాగా వివాదాల్లో చిక్కుకుంది. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ కి గురైంది.

ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్…..
తన జిమ్ ట్రైనర్ తో వర్క్ ఔట్స్ చేస్తూ తీసుకున్న వీడియో వల్ల బాగా ట్రోల్ కి గురైన నిహారిక దెబ్బకి టన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసింది. ఈ ఇష్యూని జనాలు మర్చిపోయేలోపు మళ్ళీ వివాదల్లోకి వెళ్ళింది. హైదరాబాద్ రాడిసన్ హోటల్ మింక్ అండ్ పుడింగ్ పబ్ లో పోలీసుల దాడుల్లో దొరికి మరోసారి ట్రోల్ కి గురైంది. ఇక ఆ పబ్ లో డ్రగ్స్ కూడా దొరకడంతో మరింత వివాదాస్పదం అయింది. ఈ సంఘటనల తరువాత నిహారిక మీడియాకు కనిపించడం మానేసింది. మళ్ళీ చాలా రోజుల తరువాత ఐఆమ్ బ్యాక్ అంటూ ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టి తన భర్త తో కలిసి జోర్డాన్ ట్రిప్ వెళ్లి అక్కడి ఫోటోలను షేర్ చేసింది. ఇక లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చాట్ చేసిన నిహారికకు తుంటరి ప్రశ్నలు ఎదురయ్యాయి.


నువ్వు సింగిలా అంటూ నిహారికకు ప్రశ్న ఎదురైంది. పెళ్ళైన నిహారికను అలా సింగిలా అని అడగడంతో వెంటనే నిహారిక తన భర్త తో ఉన్న ఫోటోను ట్యాగ్ చేసి తనదైన శైలిలో జవాబిచ్చింది. ఇక మరో నెటిజెన్ ఫోన్ నెంబర్ అడుగగా ఇష్… అవన్నీ చెప్పకూడదు అంటూ ఫన్నీ గా తీసుకుంది. ఇలా నిహారిక సమయస్ఫూర్తి తో సమాధానాలు ఇవ్వడంతో ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.































