Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి అందరికీ సుపరిచితమే.నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం పలు సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్దగా తనకు గుర్తింపు రాలేదు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఈమె వివాహం చేసుకున్నారు.వివాహం జరిగినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో ఈమె సినిమాలలో నటించకపోయిన వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయారు.

ఈ విధంగా నిహారిక వెబ్ సిరీస్ లకు నిర్మాతగా ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లను నిర్మించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే నిహారిక ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. అయితే ఈమె ఒక పార్టీలో సందడి చేసినట్టు తెలుస్తుంది. ఈ పార్టీలో ఈమె ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా గంగుబాయ్ గెటప్ లో సందడి చేశారు.తెలుపు రంగు చీర కట్టుకొని ఎర్రటి లిప్ స్టిక్ పెద్దగా తిలకం చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని అచ్చం గంగుబాయ్ సినిమాలు అలియా భట్ కూడా కుళ్ళుకొనేలా ఈమె ఈ గెటప్ లో సందడి చేశారు.

Niharika Konidela: గంగు భాయ్ ను తలపించిన నిహారిక…
ఈ క్రమంలోనే ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ…..గంగూని ఛానెలింగ్ చేస్తుంది. మీకు తెలుసో, తెలియదో, నేను ఇలాంటి కాస్ట్యూమ్స్ పార్టీలను ఇష్టపడతానని తెలిపింది. ఇక ఈ వీడియోలో ఇద్దరి యువకులు తనని ఆట పట్టిస్తుంటారు వారిని ఉద్దేశించి ఆ ఇద్దరి కోతుల్ని ఏమాత్రం పట్టించుకోకండి అంటూ ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై ఎంతో మంది పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ప్రశంసలు కురిపించగా అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సూపర్ అంటూ కామెంట్ చేశారు.
View this post on Instagram





























