అద్భుతమైన కథ, హాలీవుడ్ స్థాయిలో టెక్నాలజీ, భారీ బడ్జెట్ ఇంకేముంది చిత్రం ముందుకు పోవాలంటే ఓ నిర్మాత కావాలి.. అందుకోసం అప్పటివరకు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విజయశాంతి తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు. బాలకృష్ణకి వెళ్లి కథ చెప్పారు. ఆయనకు నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరోయిన్ దివ్యభారతి అనుకొని దర్శకుడిగా కోదండరామిరెడ్డి ఎంపిక చేసుకున్నారు. అలాగే ఈ హీరో, హీరోయిన్లతో పాటు భారీ తారాగణాన్ని తీసుకున్నారు.
కానీ 1990 “బొబ్బిలిరాజా” చిత్రంతో విపరీతమైన క్రేజ్ దివ్యభారతికి రావడం విశేషం. ఆ క్రమంలో ఆమె అనేక స్టార్ హీరోల చిత్రాల్లో బుక్కయ్యారు. అలా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాలో దివ్యభారతి నటించలేకపోయింది. అలా ఆమె తప్పుకోవడంతో తానే చేస్తానంటూ స్వయంగా విజయశాంతి ముందుకొచ్చారు. లోగడ బాలకృష్ణ, విజయశాంతి నటించిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా కూడా విజయవంతమవుతుందని యూనిట్ అంతా భావించారు. సినిమాకు సంబంధించిన మొత్తం ఖర్చు లెక్కవేయగా మూడుకోట్లు దాటింది. అప్పటికీ ఇంత పెద్ద మొత్తం ఎక్కువే.. ఆ క్రమంలో ఒక విజయశాంతి ఈ సినిమా నిర్మాణం చేపట్టడం కష్టమవుతుందని భావించి స్వయంగా బాలకృష్ణ మరో నిర్మాతగా అవతరించారు. అలా యువరత్న బ్యానర్ ను స్థాపించి సినిమా తీయడానికి ముందుకు వచ్చారు.
ఇక సినిమా షూటింగ్ 1991 సెప్టెంబర్ లో చెన్నైలోని ఏవిఎమ్ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి తమిళ, మలయాళ సూపర్ స్టార్స్ రజినీకాంత్, మోహన్ లాల్ హాజరయ్యారు. అద్భుతమైన కథను తయారు చేసిన “పరుచూరి సోదరులు” స్క్రిప్టు మొత్తం కోదండరామిరెడ్డికి అప్పగించారు. కానీ ఇక్కడే అసలు తిరకాసు మొదలైంది. కర్తవ్యం లాంటి చిత్రాలతో తనకు ఫాలోయింగ్ పెరిగిందంటూ విజయశాంతి హీరో బాలకృష్ణతో సమానంగా సినిమా కథలో మార్పులు చేయాలంటూ పరుచూరి సోదరులను అదేవిధంగా కోదండరామిరెడ్డిని తరుచూ అడుగుతూండేది. పగడ్బందీగా రాసుకున్న స్క్రిప్టును విజయశాంతి కి అనుగుణంగా మార్చాలంటే స్టోరీ సోల్ దెబ్బతింటుందని పరుచూరి బ్రదర్స్ వాపోయారు. అయినప్పటికీ విజయశాంతి తన ఇమేజ్ కు తగినటువంటి సీన్స్ రాయాలని కోరారు.
ఆ తర్వాత చెన్నైలోని ఏవిఎమ్, వాహిని, హైదరాబాదులో అన్నపూర్ణ, రామానాయుడు, పద్మాలయ, సారధి స్టూడియోలొతో పాటు బొగ్గుగనుల ఫ్యాక్టరీ షాట్స్ కోసం సింగరేణి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంది. హైటెక్నాలజీ ఉపయోగించి బొగ్గు గనుల ఫ్యాక్టరీలోకి భారీగా నీల్లు ప్రవాహించే సీన్ తీస్తున్న సమయంలో కొంతమందికి గాయాలవగా ఫైట్ మాస్టర్ ప్రమాదంలో మరణించారు. అతనితో పాటుగా మరో ముగ్గురు గాయపడ్డారని పుకార్లు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని సినిమా యూనిట్ ధ్రువీకరించలేదు. వారి కుటుంబ సభ్యులు న్యాయస్థానానికి వెళ్లడం, దీంతో సినిమా షూటింగ్ వాయిదా పడడం అలాగే విడుదల తేదీ కూడా వాయిదాపడింది. సినిమా మధ్యలో విజయశాంతి కథలో మార్పులు కోరడం బాలకృష్ణకు ససేమిరా ఇష్టం లేదు. ఆ క్రమంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
దర్శకుడు కోదండరామిరెడ్డి చిరంజీవితో ముఠామేస్త్రి సినిమాకి కమిట్ అయ్యారు. దానితో ఈ సినిమా మరింత ఆగిపోవాల్సివచ్చింది. ఈ సినిమాలో మిగిలిన రెండు పాటలను పరుచూరి బ్రదర్స్ ఊటీ, ఆస్ట్రేలియాలో చిత్రీకరించడం జరిగింది. ముఠామేస్త్రి తర్వాత దర్శకుడు కోదండరామిరెడ్డి ఫ్రీ అవడంతో “నిప్పురవ్వ” సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. సినిమా లేట్ అవడంతో బప్పిలహరి బాలీవుడ్ లో బిజీ కావడంతో మిగిలిన ఒక పాటను ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కోటి “రండి కదలిరండి” అనే పాటను స్వరపరచడం జరిగింది. ఇలా తరచూ సినిమా వాయిదా పడడంతో బాలకృష్ణకి తీవ్రమైన విసుగువచ్చి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “బంగారు బుల్లోడు” చిత్రం షూటింగ్ కి వెళ్లిపోయారు.
మళ్లీ సినిమా షూటింగ్ మొదటికి వచ్చింది. అనుకోని ప్రమాదం తర్వాత వివాదం.. విజయశాంతి కథలో మార్పులు కోరడం, కోదండరామిరెడ్డి మరొక సినిమా కమిట్ అవ్వడం. బాలకృష్ణకు విసుగు వచ్చి మరొక సినిమా ఒప్పుకోవడం లాంటి కారణాలతో సినిమా షూటింగ్ సీరియల్ లాగా సాగతీతగా మొదలయింది. అలా 1993 సంక్రాంతిలో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించినప్పటికీ బయ్యర్లు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ ఈ సినిమా అప్పుడు కూడా విడుదల కాలేదు. దీనితో నిప్పురవ్వ చిత్రాన్ని విజయదశమి కి వాయిదా వేయడం జరిగింది. అలా విజయదశమి కంటే ముందే 1993 సెప్టెంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన మరొక చిత్రం “బంగారుబుల్లోడు” విడుదల తేదీని కూడా సెప్టెంబర్ 3న విడుదల తేదీని ప్రకటించడం.. అటు సినీ వర్గాలను ఇటు బాలకృష్ణ అభిమానులను విస్తుపోయేలా చేసింది.
ఈ విధంగా 1993 సెప్టెంబర్ 3న “నిప్పురవ్వ”, “బంగారు బుల్లోడు” ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. విశేషమేమంటే ఒక హైదరాబాదులోనే 45 థియేటర్లో బాలకృష్ణ సినిమాలు ప్రదర్శింపబడం. నిప్పురవ్వ భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ లాంగ్ రన్ లో “బంగారు బుల్లోడు” చిత్రాన్ని మించలేకపోయింది. నిప్పురవ్వ చిత్రానికి పెట్టిన ఖర్చును కూడా ఆ సినిమా రాబట్టలేకపోయింది. దాంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని ఏ.ఆర్.రహమాన్ అందించడం కొస మెరుపు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…