Nisha agarwal : ప్రేమ-పెళ్లి-పిల్లలు ఇది ఒకప్పటి ట్రెండ్. ప్రేమ-పెళ్లి-విడాకులు ఇది ఇప్పటి ట్రెండ్ అనలేమో. ప్రేమించుకోవడం, కొన్నేళలకు పెళ్లి చేసుకోవడం ఆ తరువాత కొద్ది రోజులకే విడిపోవడం ఇప్పుడు కామన్ అయింది. సినిమా ఇండస్ట్రీలో అయితే అన్యోన్యంగా ఉన్న భార్యభర్తలు విడిపోడానికి ఎంతో సమయం పట్టడం లేదు. కారణాలు పైకి చెప్పకుండా మేము ఫ్రెండ్లీగా విడిపోతున్నాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. బాలీవుడ్ కి పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్ లో కూడా బాగా నే వినిపిస్తోంది.

విడిపోతున్న స్టార్ కపుల్…
టాలీవుడ్ లో అయితే విడాకులు అనగానే నాగ చైతన్య, సమంత జంట అందరికీ గుర్తు వస్తారు. వీళ్లిద్దరూ విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుని కుడా ఏడాది గడచింది. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా విడిపోతున్నారని తెలిసీ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే వీళ్ళిద్దరికీ మళ్ళీ సాయోధ్య కుదిరింది, రజనీకాంత్ మళ్ళీ కలిపాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విడాకులు రద్దాయ్యాయాయని వినిపిస్తోంది. ఇక ఇంతలోనే మరో హీరోయిన్ విడాకులకు సిద్ధమైందని పుకారు వినపడుతోంది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్ చెల్లి నిషా అగర్వాల్.

అక్క కాజల్ అంత ఫేమ్ కాకపోయినా నిషా తెలుగులో ఏమైంది ఈ వేళ, సోలో వంటి సినిమాలతో మంచి హిట్లే అందుకుంది. అయితే అక్క అంత గ్లామర్, టాలెంట్ లేకపోవడంతో సినిమా కెరీర్ కు గుడ్ బై చెప్పి వ్యాపార వేత్త అయిన మాన్ కరణ్ ను 2013 లో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లయ్యాక నిషా నగల వ్యాపారం చూసుకుంటూ అలానే యూట్యూబ్ ఛానెల్ ద్వారా సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంది. అయితే ఇప్పుడు నిషా తన భర్త మాన్ కరణ్ నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ అభిమానులు మాత్రం ఇవి నిజం కాకపోతే బాగుండు అనుకుంటున్నారు.


































