Nithya Menon : నిత్య మీనన్ మలయాళంకు చెందిన అమ్మాయి అయినా మలయాళం తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సుమారు 50 కి పైగా సినిమాలలో నటించింది. ఏ క్యారెక్టర్ అయినా తన నటనతో మ్యాజిక్ చేసే ఈ ముద్దుగుమ్మ 3 ఫిల్మ్‌ఫేర్, రెండు నందులతో పాటు పలు అవార్డులు సొంతం చేసుకుంది. తెలుగులో అలా మొదలైంది సినిమా ద్వారా పరిచయమైన నిత్య మొదటి తెలుగు సినిమా అయినా అందులో రెండు పాటలు పాడి అభిమానులకు ఇంకా చేరువ అయ్యింది. ఈ మధ్య ఆహా ఓటీటీ లో ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. ఇక ఇటీవల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం నిత్య మీనన్ నటించిన వెబ్ సిరీస్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది అయితే ఈ వేడుకకు హాజరు అయిన నిత్య మీనన్ ని చూసి అందరు షాక్ కి గురయ్యారు.

చేతిలో స్టిక్ తో నడవలేని స్థితిలో నిత్య…
సోమవారం హైదరాబాద్ లో ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చేతిలో స్టిక్‌తో, పక్కన ఇద్దరు బాడీగార్డుల సహాయం తీసుకొని కుంటుకుంటూ వచ్చారు. ఈ వేడుకలో ఆమె మాట్లాడుతూ.. వెబ్ సిరీస్ లో కూడా ఇదే సేమ్. నా క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. నాకు మోకాలు గాయం ఉంటుంది. అప్పుడు మొదటిసారి మోకాలికి గాయం అయితే ఎలా నడుస్తారో నటించాను.

అయితే ఇపుడు రెండు రోజుల క్రితం మెట్ల మీదనుంచి జారి కిందపడ్డా. ఇపుడు నిజంగానే సేమ్ అదే మోకాలుకు దెబ్బ తగిలింది. ఇపుడు అలానే నడుస్తున్నా అని చెప్పుంది. నిత్య మీనన్ మాట్లాడిన ఆ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు నిత్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.

































